BHAGAVAT GITA TO CONCLUDE ON V DAY _ జనవరి 13న ముగియనున్న భ‌గ‌వ‌ద్గీత ప్రవచనం

AKHANDA PARAYANAM TO BE PERFORMED

 

TIRUMALA, 26 DECEMBER 2021: One of the most appreciated and followed Parayanams across the world, Bhagavat Gita is set to conclude on the auspicious day of Vaikunta Ekadasi on January 13.

 

It may be mentioned here that TTD commenced Gita Parayanam on September 10 last and! telecasted live on SVBC for the sake of global devotees. While the Shlokas are being rendered by Vedaparayanamdar Sri Kasipathi, each Shloka is being narrated by Sanskrit scholar Sri Vishwanatha Sharma. The presentation of all Shlokas with relevant stories from puranas, epics matching the present day scenario has won appreciation especially from parents of youth and children.

 

AKHANDA PARAYANAM

 

TTD has also mulled Akhanda Parayanam with a recitation of all the 700 shlokas on the day of Vaikunta Ekadasi.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 13న ముగియనున్న భ‌గ‌వ‌ద్గీత ప్రవచనం

ముగింపు రోజున సంపూర్ణ భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2021 డిసెంబ‌రు 26: తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై జరుగుతున్న భ‌గ‌వ‌ద్గీత ప్రవచనం 2022, జనవరి 13వ తేదీన ముగియనుంది. అదేరోజున సంపూర్ణ భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.

జనవరి 13న సాయంత్రం 4 గంట‌లకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 ఆధ్యాయాల్లో గల 700 శ్లోకాలను నిరంత‌రాయంగా పారాయ‌ణం చేస్తారు. ఆ తరువాత ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.

అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణదారులు, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన పండితులు, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు పాల్గొంటారు.

భగవద్గీత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు 2020 సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం నిర్వ‌హిస్తున్నారు. 16 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.