FINALS OF STATE LEVEL BHAGAVADGITA CONTESTS ON DECEMBER 29- PRIZE DISTRIBUTION ON DECEMBER 30 _ డిసెంబ‌రు 29న తిరుప‌తిలో రాష్ట్ర‌స్థాయి భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్తం పోటీలు

Tirupati, 27 December 2021: The finals of Bhagavadgita recital for students organised by the HDPP wing of TTD in both Telugu states besides Chennai and Bangalore will be held at Mahati Auditorium on December 29 and prizes presentation on December 30.

On December 29 at 9.30 am final contests will be held for 6-7 and 8-9 classes in two separate categories in rendering shlokas from chapter 17 of Bhagavadgita -Shdhatraya Yogam. The winners of this contest will get Silver medals with the image of Sri Venkateswara Swamy.

Similarly for 18 above and 18 below youth who topped in the district wise contests separate competitions will be organised to render shlokas from Bhagavadgita at the Mahati auditorium same day. The winners of these categories will be given cash prizes.

According to HDPP AEO Sri Satyanarayana, the winners of all these four different categories of contests will be presented with medals and cash purses on December 30 at 10am.in Mahati Auditorium.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబ‌రు 29న తిరుప‌తిలో రాష్ట్ర‌స్థాయి భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్తం పోటీలు

డిసెంబ‌రు 30న బ‌హుమ‌తుల ప్ర‌దానం

తిరుప‌తి, 2021 డిసెంబ‌రు 27: టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్రచార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల‌తోపాటు చెన్నై, బెంగ‌ళూరులో గీతాజ‌యంతి సంద‌ర్భంగా నిర్వ‌హించిన భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్తం పోటీల్లో ప్ర‌థ‌మ స్థానం పొందిన వారికి తిరుప‌తి మ‌హ‌తి ఆడిటోరియంలో డిసెంబ‌రు 29వ తేదీ ఉద‌యం 9.30 గంట‌ల నుంచి రాష్ట్ర‌స్థాయి పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.

భ‌గ‌వ‌ద్గీత‌లోని 17వ అధ్యాయం శ్ర‌ద్ధాత్ర‌య విభాగ యోగంలో 6, 7 త‌ర‌గతుల విద్యార్థిని విద్యార్థులు ఒక విభాగంగాను, 8, 9 త‌ర‌గ‌తుల విద్యార్థినీ విద్యార్థులు ఒక విభాగంగాను ఈ పోటీలు నిర్వ‌హిస్తారు. రాష్ట్ర‌స్థాయిలో ప్ర‌థ‌మ‌, ద్వితీయ‌, తృతీయ స్థానాల్లో గెలుపొందిన వారికి డిసెంబ‌రు 30వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌హ‌తి ఆడిటోరియంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ర‌జత ప‌త‌కాల‌ను బ‌హూక‌రిస్తారు.

భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 అధ్యాయాల్లో గ‌ల 700 శ్లోకాలు కంఠ‌తా వ‌చ్చిన 18 సంవ‌త్స‌రాల‌లోపు వారికి ఒక విభాగంగాను, 18 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారికి మ‌రొక విభాగంగాను జిల్లా కేంద్రాల్లో నిర్వ‌హించిన పోటీల్లో ప్ర‌థ‌మ‌స్థానంలో నిలిచిన వారికి రాష్ట్ర‌స్థాయిలో ఈ నెల 29వ తేదీన ఉద‌యం 9.30 గంట‌ల‌కు పోటీలు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో గెలుపొందిన వారికి డిసెంబ‌రు 30వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి సుప్ర‌సిద్ధ ఆచార్యులు, పండితులు, అధ్యాప‌కులు, న్యాయ‌నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని డిపిపి స‌హాయ కార్య‌నిర్వ‌హ‌ణాధికారి శ్రీ స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.