BHAJANS AND DHARMIC ACTIVITIES NADA NIRAJANAM _ అల‌రులు గురియ‌గ నాడెన‌దే… అల‌కల గులుకుల న‌ల‌మేల్మంగ‌… నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆక‌ట్టుకున్న బాల‌క‌ళాకారుడు రాహుల్ గాత్రం

Tirumala, 13 October 2018: The ongoing Navaratri Brahmotsavam at Tirumala has become a fountainhead of cultural and performing arts presentation at its prestigious platforms of Nada Niranjanam and Asthana Mandapam.

On Day 4 of the Brahmotsavams cultural activities began at the Nada Niranjanam with the Mangaladwani by K Eswaramma, K Raviprabha and team in the early hours of Saturday. The students and teachers of the Sri Venkateswara Pathashala, Dharmagiri presented the Chaturveda Parayanam.

Later on the team of teachers from Bharatiya Vidhya Bhavan, Tirupati rendered Vishnu sahasranamam besides the Dharmikopanyasam by Rani Sadashiv murthy of Tirupati.

In the afternoon the Rahul and troupe from Bangalore rendered the Anammayya Sankeertans followed by Padmapriya Natarajan troupe from Coimbatore presented the Nama sankeertan.

In the evening the V Rahul and troupe from Bangalore again presented sankeertans at Unjal Seva. The feat of cultural programs at Brahmotsavam the Nada Niranjanam theater for the day climaxed with the harikatha by P Vijaylakshmi, Bhagavatarini from Kapileswarapuram, East Godavari.

At the Asthana Mandapam the Madhavi Latha troupe from Hosur presented the Bhakti Sangeet in the morning hours.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అల‌రులు గురియ‌గ నాడెన‌దే… అల‌కల గులుకుల న‌ల‌మేల్మంగ‌…
నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆక‌ట్టుకున్న బాల‌క‌ళాకారుడు రాహుల్ గాత్రం

అక్టోబ‌రు 13, తిరుమల 2018 ; అల‌రులు గురియ‌గ నాడెన‌దే… అల‌కల గులుకుల న‌ల‌మేల్మంగ‌… అంటూ బెంగ‌ళూరుకు చెందిన బాల క‌ళాకారుడు రాహుల్ ఆల‌పించిన కీర్త‌న భ‌క్తుల‌ను భ‌క్తిసాగ‌రంలో ముంచెత్తింది. నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ‌నివారం అన్న‌మ‌య్యవిన్న‌పాలు కార్య‌క్ర‌మంలో భాగంగా రాహుల్ ప‌లు సంకీర్త‌న‌లను మృదుమ‌నోహ‌రంగా ఆల‌పించాడు. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద‌పాఠ‌శాల సంయుక్త‌ ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం శ్రీమ‌తి కె.ఈశ్వ‌ర‌మ్మ‌, శ్రీ‌మ‌తి కె.ర‌విప్ర‌భ బృందం బృందం మంగళధ్వని, తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. అదేవిధంగా, తిరుపతికి చెందిన శ్రీ భార‌తీయ విద్యాభ‌వ‌న్ బృందం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, తిరుప‌తికి చెందిన శ్రీ రాణి స‌దాశివ‌మూర్తి ధార్మికోపన్యాసం చేశారు.

సాయంత్రం అన్నమయ్య విన్నపాలు కార్య‌క్ర‌మంలో భాగంగా బెంగ‌ళూరుకు చెందిన రాహుల్ బృందం ”వందేహం జ‌గ‌ద్వ‌ల్ల‌భం… నిగ‌మ నిగ‌మాంత‌…., మ‌నుజుడైపుట్టి…., ప‌ర‌మ‌పురుష నిరుప‌మాన‌…, చేరియ‌శోద‌కు….” త‌దిత‌ర కీర్త‌న‌ల‌ను రాగ‌భావ‌యుక్తంగా చ‌క్క‌టి ఉచ్ఛార‌ణ‌తో గానం చేశారు. ఆ త‌రువాత కోయంబ‌త్తూరుకు చెందిన శ్రీ‌మ‌తి ప‌ద్మ‌ప్రియ న‌ట‌రాజ‌న్ బృందం నామ‌సంకీర్త‌నంలో ప‌లు కీర్త‌న‌ల‌ను ల‌య‌బ‌ద్ధంగా ఆల‌పించారు. ఊంజల్‌సేవలోనూ బెంగ‌ళూరుకు చెందిన రాహుల్ బృందం చ‌క్క‌టి అన్నమాచార్య సంకీర్తనలను ర‌స‌ర‌మ్యంగా గానం చేశారు. అనంత‌రం క‌పిలేశ్వ‌ర‌పురానికి చెందిన శ్రీ‌మ‌తి పి.విజ‌య‌ల‌క్ష్మి భాగ‌వ‌తారిణి హరికథ పారాయణం చేశారు.

అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో శ‌నివారం ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు క‌ర్ణాట‌క రాష్ట్రం హోసూర్‌కు చెందిన శ్రీమ‌తి మాధ‌వీల‌త బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.