PURANIC PLAY THRILLS DEVOTEES AT MAHATI _ తిరుప‌తిలో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సాంస్కృతిక శోభ‌

Tirumala, 13 October 2018: The cultural activities of the Navaratri Brahmotsavam picked up momentum on Day-4 with the vibrant devotional dance program by the Sri Vinayaka Natya Mandali (Surabi artists), Hyderabad at the Mahati Auditorium.

At the Annamacharya Kala mandir the artists Roopa Kumari troupe from Visakhapatnam presented melodious Bhakti Sangeet and soaked the music lovers of Tirupati in devotional elixir.

Similarly at the Ramachandra Pushkarini Sri Bala Mukunda Bhajana mandali and team from Bangalore presented an enlightening dharmic discourse at the.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుప‌తిలో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సాంస్కృతిక శోభ‌

అక్టోబ‌రు 13, తిరుమల 2018 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా శ‌నివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీ వినాయక నాట్యమండలి బృందం పౌరాణిక నాట‌కాన్ని ప్ర‌ద‌ర్శించారు.

అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశాఖకు చెందిన రూప కుమారి బృందం భక్తి సంగీతం వినిపించారు. రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీ బాల ముకుంద భజనమండలి బృందం చ‌క్క‌గా నామసంకీర్తన.నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.