BHASHYAKARLA UTSAVAM TO COMMENCE ON APRIL 9 _ ఏప్రిల్ 9 నుండి శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్స‌వం

Tirumala, 08 April 2021: The Bhashyakarla utsavam commences in Tirumala temple on April 9 and concludes on April 27.

On the occasion of the birth of Sri Ramanujacharya in the holy Vaisakha month on Arudra star, this utsavam is observed every year for 19 days in Tirumala temple.

This year, Bhashyakarlavari Sattumora will be observed on April 18. On this day, Sridevi, Bhudevi sametha Sri Malayappa takes a ride in four Mada streets after Sahara Deepalankara Seva accompanied by Sri Ramanujacharya also known as Bhashyakarulavaru on another Tiruchi.

Later Sattumora is performed. Jiyar Swamis, Ekangis take part in this fete.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 ఏప్రిల్ 9 నుండి శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్స‌వం

తిరుమల, 2021 ఏప్రిల్ 08: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9 నుండి 27వ తేదీ వ‌ర‌కు భాష్యకార్ల ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరుగ‌నుంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 18వ తేదీన భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7.00 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు పాల్గొంటారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.