KAT IN GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 08 April 2021: Koil Alwar Tirumanjanam was held in Sri Govindaraja Swamy temple on Thursday in connection with Ugadi. 

The entire temple premises was cleansed with Parimalam mixture. 

Spl.Gr. Dy EO Sri Rajendrudu and others were present during Koil Alwar Tirumanjanam that was held in Ekantam in view of Covid guidelines.

BHASHYAKARLA UTSAVAM FROM APRIL 9 ONWARDS

 The Bhashyakarla Utsavam will commence from April 9th onwards in Sri Govindaraja Swamy temple and Sattumora will be held on April 18.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2021 ఏప్రిల్ 08: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 13వ‌ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, స‌హ‌స్ర‌నామార్చ‌న‌ నిర్వహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య‌ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, ప్ర‌ధానార్చ‌కులు శ్రీ శ్రీ‌నివాస‌దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ వెంక‌టాద్రి‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ మునీంద్ర‌బాబు, ఆలయ అర్చ‌కులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 9 నుండి భాష్య‌కార్ల ఉత్స‌వం

తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ భాష్య‌కార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్స‌వం ఏప్రిల్ 9 నుండి 18వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు భాష్యకార్ల వారిని విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వ‌హిస్తారు. ఏప్రిల్ 18న సాత్తుమొర జ‌రుగ‌నుంది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.