BIRRD HOSPITAL TO BE AN EXTENSION COVID HOSPITAL FOR SVIMS _ స్విమ్స్ కోవిడ్ ఆసుప‌త్రికి అనుసంధానంగా బ‌ర్డ్ ఆసుప‌త్రి

Tirupati, 15 Jul. 20: As the COVID 19 positive cases are increasing day by day, TTD has permitted Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) to utilize Balaji Institute of Surgery, Research, Rehabilitation for the Disabled (BIRRD) ortho hospital as an extension COVID hospital.

A meeting was held in the Conference Hall in TTD Administrative Building at Tirupati on Wednesday by TTD EO Sri Anil Kumar Singhal along with District Collector Sri Bharat Narayan Gupta and other authorities of TTD. 

Upon the request of District Collector, the EO has given nod to hand over the 400 rooms capacity Vishnu Nivasam Rest House to District Administration to treat COVID patients. 

The existing Slotted Sarva Darshanam token issuing counters at Vishnu Nivasam will be shifted to Alipiri Bhudevi Complex enhancing the counter numbers which are already existing here.

Later the TTD EO directed the concerned officers of TTD to provide branded sanitizers to the employees working in all local temples of TTD. 

He also reviewed on the food that is being provided to employees as per the menu decided by the Employees Committee and also on the COVID tests that are being carried out for employees working at Tirumala.

Additional EO Sri AV Dharma Reddy, JEOs Sri P Basant Kumar, Smt Bhargavi, CVSO Sri Gopinath Jatti, SVIMS Director Dr Vengamma, Health Officer of TTD Dr RR Reddy, Joint Collector Sri Chandra Mouli, Deputy Collector Sri Rangaswamy were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్విమ్స్ కోవిడ్ ఆసుప‌త్రికి అనుసంధానంగా బ‌ర్డ్ ఆసుప‌త్రి 
 
తిరుపతి, 2020 జూలై 15: రోజురోజుకూ కోవిడ్‌-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్ర‌మంలో బ‌ర్డ్ ఆసుప‌త్రిని స్విమ్స్ కోవిడ్ ఆసుప‌త్రికి అనుసంధానంగా వినియోగించేందుకు టిటిడి అంగీకరించింది.
 
 తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం గ‌ల స‌మావేశ మందిరంలో బుధ‌వారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ భ‌ర‌త్ నారాయ‌ణ గుప్తా ఇత‌ర టిటిడి అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. 
 
కోవిడ్ రోగుల‌కు వైద్యం అందించేందుకు క‌లెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి మేర‌కు  స్విమ్స్ కోవిడ్ ఆసుప‌త్రికి అనుసంధానంగా బ‌ర్డ్ ఆసుప‌త్రిని వినియోగించేందుకు, తిరుప‌తిలోని 400 గదుల విష్ణునివాసం విశ్రాంతి గృహాన్ని జిల్లా యంత్రాంగానికి అప్ప‌గించేందుకు ఈవో అంగీక‌రించారు. 
 
టిటిడి స్థానికాల‌యాల్లో విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగుల‌కు బ్రాండెడ్ శానిటైజ‌ర్లు అందించాల‌ని సంబంధిత టిటిడి అధికారుల‌ను ఈవో ఆదేశించారు. తిరుమ‌ల‌లో ఉద్యోగుల‌కు చేస్తున్న కోవిడ్ ప‌రీక్ష‌లు, ఉద్యోగుల‌తో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయించిన పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని అందించ‌డం త‌దిత‌ర అంశాల‌పై ఈవో స‌మీక్షించారు. 
 
కాగా, ఇక‌పై విష్ణునివాసంలో ఉన్న స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ కౌంట‌ర్ల‌ను మూసివేసి అలిపిరి వ‌ద్ద గ‌ల భూదేవి కాంప్లెక్స్‌లో కౌంట‌ర్ల సంఖ్య‌ను పెంచి భ‌క్తుల‌కు టోకెన్లు కేటాయిస్తారు.
 
ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈఓ శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, శ్రీ‌మ‌తి భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, స్విమ్స్ సంచాల‌కులు డా. వెంగ‌మ్మ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ శ్రీ చంద్ర‌మౌళి, డెప్యూటీ క‌లెక్ట‌ర్ శ్రీ రంగ‌స్వామి, టిటిడి ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్‌.ఆర్‌.రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. 
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.