BLESSED TO BE ADDITIONAL EO OF TTD _ శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా టీటీడీ సేవలు – టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి

FEEDBACK TO ENHANCE DEVOTEE-FRIENDLY MEASURES

NEW ADDITIONAL EO OF TTD SRI CH VENKAIAH CHOWDHARY

TIRUMALA, 27 JULY 2024: With the benign blessings of Lord Venkateswara, I am blessed to assume the charge as Additional EO of Tirumala Tirupati Devasthanams, said the new Additional EO of TTD Sri Ch Venkaiah Chowdhary.

After assuming charges as TTD Addnl.EO in Tirumala temple on Saturday, he offered prayers in the sanctum sanctorum of Sri Venkateswara Swamy along with his family. Later he was rendered Vedaseervachanam by the Veda Parayanamdars at Ranganayakula Mandapam.

TTD JEO Sri Veerabrahmam offered Theertha Prasadams, Swamivari laminated photo, Agarbattis and Go products to the Additional EO.

Speaking on the occasion, the Additional EO thanked the Honourable CM of AP Sri Chandra Babu Naidu for giving him the opportunity to serve as Additional EO of TTD.

” The Feedback mechanism plays a vital role to enhance the amenities to pilgrims. I prayed Srivaru to give enough strength to safeguard the tradition of the world-renowned temple and serve the devotees with utmost dedication”, he maintained.

CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, Temple DyEO Sri Lokanatham, Reception DyEO Sri Harindranath, DyEO Board Cell Smt Prasanthi, CPRO Dr T Ravi and others officers were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా టీటీడీ సేవలు

– టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి

తిరుమల, 2024 జూలై 27: శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టం అని టీటీడీ కొత్త అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు.

తిరుమల ఆలయంలో శనివారం టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పారాయణ దారులు వేదశీర్వచనం చేశారు.

తరువాత అదనపు ఈవోకు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం తీర్థప్రసాదాలు, స్వామివారి ఫోటో, అగరబత్తులు, గో ఉత్పత్తులను అందించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, టీటీడీ అదనపు ఈవోగా తనకు అవకాశం కల్పించిన గౌ|| ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు వేలాదిగా విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా, స్నేహపూర్వకంగా అందిస్తామని చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు.
భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీవారి ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు, భక్తులకు అత్యంత అంకితభావంతో సేవలందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

అంతకుముందు అదనపు ఈవో తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరాహస్వామిని దర్శించుకున్నారు

ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ హరీంద్రనాథ్, శ్రీమతి ప్రశాంతి, సీపీఆర్వో డాక్టర్ టీ.రవి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.