“BRAHMA” UTSAVAMS OFF TO A COLOURFUL START_ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
EO TAKES PART IN THE.FETE
Srinivasa Mangapuram, 24 Feb. 19: The navahnika annual brahmotsavams in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram off to a colourful start with Dhwajarohanam on Sunday morning.
The Garuda Dhwaja was offered worship by a group of acharyas as per the tenets of Vaikhanasa Agama in the scheduled Meena Lagnam between 9am and 9.18am.
TTD EO Sri Anil Kumar Singhal who took part in this auspicious fete said that TTD has made elaborate arrangements for these brahmotsavams.
Speaking on the occasion, Kankana Bhattar Sri Balaji Swamy said the legend says that those who witness the Dhwajarohanam, Garuda Seva, Brahma Ratham, Snapana Tirumanjanam and Chakra snanam during this fete will attain salvation.
Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Suptd Sri Muni Chengalrayulu, Temple Inspector Sri Anil and others took part.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2019 ఫిబ్రవరి 24: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం 9.00 నుండి 9.18 గంటల మధ్య మీనలగ్నంలో జరిగిన ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రం శాస్త్రోక్తంగా జరిగింది.
అంతకుముందు ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠిస్తారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది. ఆలయ ప్రధాన కంకణబట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ పురాతనమైన కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 28న గరుడసేవ, మార్చి 1న స్వర్ణరథోత్సవం, మార్చి 3న రథోత్సవం, మార్చి 4న చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు. ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను రద్దు చేసినట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ, ఆకర్షణీయంగా పుష్పాలంకరణలు, లైటింగ్‌తో కటౌట్లు ఏర్పాటుచేశామన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్వామివారి ఆలయంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. వాహనసేవల్లో వివిధ జిల్లాల నుండి కళాబృందాలు ప్రదర్శనలివ్వనున్నట్టు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధనంజయులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మయ్య, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.