BRINDAVANA BHAJANA STEALS THE SHOW_ సూర్యప్రభ వాహనసేవ‌లో మైమ‌ర‌పించిన భ‌ర‌త‌నాట్యం, బృందావ‌న భ‌జ‌న‌

Tirumala, 19 September, 2018: The cultural programmes in the ongoing annual brahmotsvams are immensely attracting the attention of pilgrims.

Among the various arts performed on Wednesday, Brindavana Bhajana, a rhythmic dance form of bhajan, emerged out to be unique.

A 15-memeber team lead by Sri P Swamulu from Krishna District presented this dance format of Bhajan by rendering 50 sankeertana bhajans.

While Smt Sri Rammani Umesh from Bengaluru, an A grade Bharatanatyam danseuse in Door Darshan and founder of Ragini Sangeetha Nrutyalaya, performed before vahana devas with her 24 member team. She expressed her immense pleasure to perform during mega religious event in Tirumala.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTD, TIRUPATI

సూర్యప్రభ వాహనసేవ‌లో మైమ‌ర‌పించిన భ‌ర‌త‌నాట్యం, బృందావ‌న భ‌జ‌న‌

సెప్టెంబరు 19, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌వారం ఉదయం జ‌రిగిన సూర్య‌ప్ర‌భ వాహ‌న‌సేవ‌లో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారులు ప్ర‌ద‌ర్శించిన భ‌ర‌త‌నాట్యం, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ క‌ళాకారుల బృందావ‌న భ‌జ‌న భ‌క్తుల‌ను మైమ‌ర‌పించాయి.

బెంగ‌ళూరులోని రాగిణి సంగీత నృత్యాల‌య స్థాప‌కురాలు శ్రీ‌మ‌తి శ్రీ‌రంజిని ఉమేష్ ఆధ్వ‌ర్యంలో 24 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శించిన భ‌ర‌త‌నాట్యం ఆక‌ట్టుకుంది. శ్రీ‌మ‌తి శ్రీ‌రంజిని ఉమేష్ దూర‌ద‌ర్శ‌న్ ఎ గ్రేడ్ భ‌ర‌త‌నాట్య క‌ళాకారిణిగా గుర్తింపుపొందారు. ఈ బృందంలోని క‌ళాకారులు “బారోకృష్ణ‌య్య‌…., శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌…., నారాయ‌ణ‌తే న‌మో న‌మో…., విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌…” త‌దిత‌ర సంకీర్త‌న‌ల‌కు చ‌క్క‌టి అభినయంతో న‌ర్తించారు. మొద‌టిసారిగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసి స్వామివారి ఎదుట ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం అదృష్టంగా భావిస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా శ్రీ‌మ‌తి శ్రీ‌రంజిని ఉమేష్ తెలిపారు.

అదేవిధంగా, కృష్ణా జిల్లా మైల‌వ‌రం మండ‌లం వెదురుబేడుకు చెందిన శ్రీ పొలుసు స్వాములు ఆధ్వ‌ర్యంలో 15 మంది క‌ళాకారులు ల‌య‌బ‌ద్ధంగా అడుగులు వేస్తూ సాగిన‌ బృందావ‌న భ‌జ‌న అల‌రించింది. ఇందులో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి, శ్రీ‌రాముడు, శ్రీ‌కృష్ణుల‌వారిని కీర్తిస్తూ జాన‌ప‌ద బాణీలో పాట‌లు పాడుతూ భ‌జ‌న చేశారు. సుమారు 50 వ‌ర‌కు భ‌జ‌న పాట‌లు పాడుతూ భ‌జ‌న చేస్తామ‌ని శ్రీ స్వాములు తెలిపారు. మూడోసారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంద‌ని క‌ళాకారులు తెలియ‌జేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.