DEVOTEES WORSHIP SURYA NARAYANA SWAMY ON SURYAPRABHA VAHANAM_ సూర్యప్రభ వాహనంపై యోగ‌ముద్ర‌లో బ‌ద్రినారాయ‌ణుడు

Tirumala, 19 September 2018: On the seventh day morning, Sri Malayappa swamy blessed His devotees as Sri Suryanarayana Murthy on Surya Prabha Vahanam.

According to our mythology, Lord Sriman Narayana lies in the midst of Surya Mandala which is the Sun’s sphere in the cosmos.

Wearing a diamond gauntlet, seated majestically atop the seven horses driven Surya Prabha Vahanam, Sri Malayappa Swamy took a celestial ride along the four mada streets.

Devotees were thrilled to see Sri Malayappa Swamy on Surya Prabha Vahanam on Wednesday morning.

TTD EO Sri Anil Kumar Singhal, JEO Sri KS Sreenivasa Raju, Board Members Sri Rayapati Sambasiva Rao, Smt Sudha Narayanamurthy, Sri Ashok Reddy, Addl CVSO Sri Sivakumar Reddy, VGO Sri Ravindra Reddy,Temple DyEO Sri Haridranath and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై యోగ‌ముద్ర‌లో బ‌ద్రినారాయ‌ణుడు

 సెప్టెంబరు  19,  తిరుమల 2018:    కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన బుధ‌వారం ఉదయం శేషాచలాధీశుడు సూర్యప్రభ వాహనంపై యోగ‌ముద్ర‌లో బ‌ద్రినారాయ‌ణుడి అవతారంలో తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

అనంతరం మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపనతిరుమంజనం వైభవంగానిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా జరగనుంది. 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.