BTU OF KURUKSHETRA SV TEMPLE FROM MAY 31 – JUNE 8 _ మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు కురుక్షేత్రలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Tirupati,28, May 2023: The annual brahmotsavams in Srivari temple at Kurukshetra will be observed between May 31 to June 8 with Ankurarpanam on May 30.
The important days includes Dhwajarohanam on May 31, Kalyanotsavam and Garuda Vahanam on June 4, Rathotsavam on June 7 and Chakra Snanam on June 8 while Pushpayagam will be performed on June 9 between 5pm and 7pm.
మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు కురుక్షేత్రలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2023 మే 28: హర్యానా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్ర శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 30న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
31-05-2023 ధ్వజారోహణం పెద్దశేష వాహనం
01-06-2023 చిన్నశేష వాహనం హంస వాహనం
02-06-2023 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
03-06-2023 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
04-06-2023 మోహినీ అవతారం కల్యాణోత్సవం గరుడ వాహనం
05-06-2023 హనుమంత వాహనం గజ వాహనం
06-06-2023 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07-06-2023 రథోత్సవం అశ్వవాహనం
08-06-2023 చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 4వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. జూన్ 9వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరగనుంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.