PUSHPA YAGAM AT NAGALAPURAM TEMPLE _ జూన్ 8న శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆలయంలో పుష్పయాగం

Tirupati, 28, May 2023: TTD is organising a grand Pushpayagamm fete at the Sri Veda Narayana temple, Nagulapuram on June 8 with an Ankurarpanam fete on June 7.

 

In this connection, the Snapana thirumanjanam will be held on June 8 morning and Pushpa yagam in the evening and thereafter the Veedhi utsavam. Interested devotees can participate in the fete with a 750 ticket.

 

The event s held to ward off the bad impact of any lapses by either devotees or the archakas during the recent annual Brahmotsavam fete.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూన్ 8న శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆలయంలో పుష్పయాగం

తిరుపతి, 2023 మే 28: నాగ‌లాపురం శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆలయంలో జూన్ 8వ తేదీ పుష్పయాగ మహోత్సవం జ‌రుగ‌నుంది. ఇందుకోసం జూన్ 7వ తేదీ సాయంత్రం 6-15 గంటల నుండి రాత్రి 7-45 గంటల వరకు పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, మృత్సంగ్రాహ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

జూన్ 8న ఉదయం 11 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామివారికి అభిషేకం చేస్తారు.

గృహస్తులు (ఇద్దరు) రూ.750/- టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.

అనంతరం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వ‌ర‌కు వీధి ఉత్సవం జరుగనుంది.
ఈ ఆల‌యంలో మే 4 నుండి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.