TIRUPATI JEO REVIEWS TTD CALL CENTRE_ టిటిడి కాల్‌ సెంటర్‌ పనితీరుపై తిరుపతి జెఈవో సమీక్ష

Tirupati, 12 Mar. 19: Joint Executive Officer Sri B Lakshmikantham on Tuesday directed officials to utilise state of art technology to deliver faster, responsible, comprehensive and user-friendly information to scores of devotees.

Reviewing the functioning and infrastructure of the Call centre at the TTD Administration building on Tuesday the JEO exhorted the Call centre staff to quickly resolve the queries by devotees calling from all over the world.

Gather information from all concerned departments on the grievances raised by devotees and provide a complete and satisfactory response at a quicker pace

He directed the IT officials to ensure the queries of devotees are forwarded to concerned departments and responses are made available at the Call centre.

The JEO said the TTD officials should frequently gather all informations on TTD programs by adapting the Integrated Complaint Responsive System to keep devotees well informed.

He directed officials to function effectively to reduce the number of complaints at the TTD rest houses.

TTD chief engineer Sri Chandrasekhar Reddy, Additional CVSO Sri Sivakumar Reddy, Spl Gr DyEO Smt Parvathi, OSD Anna Prasadam, Sri Venugopal, DyEOs Smt Jhansi Rani, Sri Balaji, Smt Nagaratna, Smt Lakshmi Narasamma and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి కాల్‌ సెంటర్‌ పనితీరుపై తిరుపతి జెఈవో సమీక్ష

తిరుపతి, 2019 మార్చి 12: టిటిడి కాల్‌ సెంటర్‌లో అత్యాధునిక సాంకెేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత వేగవంతంగా, సులభంగా, సమగ్రంగా, బాధ్యతాయుతంగా, పరిమితకాలంలో సమాచారం అందించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం కాల్‌ సెంటర్‌ సిబ్బందిని ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ పనితీరుతో పాటు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి వస్తున్న ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. వివిధ శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి సంబంధిత భక్తులకు సమాచారం అందించాలన్నారు. టిటిడి కాల్‌ సెంటర్‌కు వచ్చిన సూచనలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు క్రోడికరించి ఆయా విభాగాల ఉన్నతాధికారులకు చేరవేయాలని జెఈవో ఐటి అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం టిటిడి చేపడుతున్న కార్యక్రమాల సమాచారం ఎప్పటికప్పుడు సిబ్బంది తెలుసుకుంటే సులభంగా సమాచారం అందించవచ్చన్నారు. భక్తుల నుండి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత విభాగపు అధికారి వెంటనే స్పందించేలా ఇంటిగ్రేటెడ్‌ కంప్లయింట్‌ రెస్పాంసివ్‌ సిస్టమ్‌ను మెరుగ్గా ఉపయోగించుకోవాలన్నారు.

టిటిడి వసతి గృహాలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందించాలన్నారు. ఫిర్యాదుల సంఖ్య తగ్గించేలా ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సిఈ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌ రెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, డిప్యూటీ ఈవోలు శ్రీమతి ఝాన్సీరాణి, శ్రీ బాలాజీ, శ్రీమతి పార్వతి, శ్రీమతి నాగరత్న, శ్రీమతి లక్ష్మీనరసమ్మ, శ్రీ చెంగల్‌రాయలు, సప్తగిరి మాసమాత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ రాధారమణ, కాల్‌ సెంటర్‌ ఏఈవో శ్రీ ఆనందరాజు, ఇడిపి ఒఎస్‌డి శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు, కాల్‌ సెంటర్‌ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.