KRT BRAHMOTSAVAMS FROM APRIL 3 TO 11_ ఏప్రిల్‌ 3 నుండి 11వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

Tirupati, 12 Mar. 19: The famous sub-shrine of TTD dedicated to Sri Kodanda Rama Swamy in Tirupati is gearing up for annual brahmotsavams in the month of April, said Tirupati JEO Sri B Lakshmikantham

The posters for the big event was released in JEO chamber in Tirupati on Tuesday in TTD administrative building. The JEO said, the important days includes Dhwajarohanam on April 3, Garuda Seva on April 7, Hanumantha Vahanam on April 8, Chakrasnanam on April 11.

He also added Sri Rama Navami Utsavams will commence on April 14 with Sita Rama Kalyanam on April 15 and Sri Rama Pattabhishekam on April 16.

The JEO said annual teppotsvams will be observed from April 17 to 19 in Sri Ramachandra Pushkarini.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఏప్రిల్‌ 3 నుండి 11వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

గోడపత్రికల ఆవిష్కరణ

తిరుపతి, 2019 మార్చి 12: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 3 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో మంగళవారం జెఈవో బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

తేదీ ఉదయం సాయంత్రం

03-04-19(బుధవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం

04-04-19(గురువారం) చిన్నశేష వాహనం హంస వాహనం

05-04-19(శుక్రవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

06-04-19(శనివారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

07-04-19(ఆదివారం) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం

08-04-19(సోమవారం) హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం

09-04-19(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

10-04-19(బుధవారం) రథోత్సవం అశ్వవాహనం

11-04-19(గురువారం) పల్లకీ ఉత్సవం/చక్రస్నానం ధ్వజావరోహణం

ఏప్రిల్‌ 14 నుండి 16వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు :

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 14 నుండి 16వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 14న శ్రీరామనవమి, 15న శ్రీ సీతారామ కల్యాణం, 16న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు.

ఏప్రిల్‌ 17 నుండి 19వ తేదీ వరకు తెప్పోత్సవాలు :

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 17 నుండి 19వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా రామచంద్ర పుష్కరిణిలో 17వ తేదీన మొదటిరోజు 5 చుట్లు, 18న రెండవ రోజు ఏడు చుట్లు, 19న చివరిరోజు తొమ్మిది చుట్లు తిరిగి స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.