CAMERAS DONATED _ ఎస్వీబీసీ కి రూ 12 లక్షల విలువైన కెమెరాల విరాళం

TIRUMALA, 12 OCTOBER 2021: Former MLC Dr TA Saravana has donated Rs. 12lakhs worth cameras and handed over them to TTD Chairman Sri YV Subba Reddy in front of Tirumala temple on Tuesday.

Speaking on the occasion, the Chairman said the cameras will be used for Kannada SVBC which was inaugurated by Honourable CM Sri YS Jaganmohan Reddy.

He said, CM has appreciated the Spiritual and Dharmic programmes being telecasted in SVBC and also the recently taken up initiatives including Gudiko Gomata, Go Adharita Naivedyam, Agarbattis, Dry Flower Technology, Go Green activities etc.by TTD.

He said Kannada and Hindi channels are already on air on SVBC 3 and 4 respectively. He said an anonymous devotee has come forward to donate Rs. 10lakhs for Kannada SVBC appreciating programmes.

TTD EO Dr KS Jawahar Reddy, MP Sri Prabhakar Reddy, board member Smt Prasanthi, Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CEO Sri Suresh Kumar were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీబీసీ కి రూ 12 లక్షల విలువైన కెమెరాల విరాళం

– శ్రీవారి ఆలయం ముందు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి అందించిన దాత డాక్టర్ టిఎ శరవణ

తిరుమల 12 ఆక్టోబరు 2021: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కు కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ టిఎ శరవణ మంగళవారం రూ.12 లక్షల విలువ చేసే రెండు వీడియో కెమెరాలను విరాళంగా అందించారు.
శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి కెమెరాలను అందజేశారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్వీబీసీ కన్నడ ఛానల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం కన్నడ ఛానల్ కు ఉపయోగించేందుకు దాత ఈ కెమెరాలను అందజేశారు.

టీటీడీ కార్యక్రమాలను సిఎం అభినందించారు : చైర్మన్
టీటీడీ చేస్తున్న ధార్మిక, సంప్రదాయ కార్యక్రమాలను ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ కు కెమెరాల విరాళం స్వీకరించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. టీటీడీ అమలు చేస్తున్న గో ఆధారిత ఉత్పత్తులతో స్వామివారి ప్రసాదాల తయారీని సిఎం మెచ్చుకున్నారని చెప్పారు. టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో అగరబత్తుల తయారీ బాగుందని, వీటిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందించేలా ఒక బ్రాన్డింగ్ తయారు చేయాలని చెప్పారన్నారు. టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో చిత్ర పటాలు తయారు చేయడాన్ని అభినందించారని, కొన్ని సూచనలు కూడా చేశారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కన్నడ భక్తుల కోసం కన్నడ ఛానల్, ఉత్తరాది భక్తుల కోసం హింది ఛానల్ ప్రసారాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయని చైర్మన్ తెలిపారు. కన్నడ కార్యక్రమాలు చాలా బాగున్నాయని చెబుతూ ఒక అజ్ఞాత భక్తుడు రూ 10 లక్షల విరాళం అందించడానికి ముందుకొచ్చారని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాలక మండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది