HANUMANTHA VAHANAM HELD _ హనుమంత వాహనంపై వేంకటాద్రిరామునిగా శ్రీ మలయప్పస్వామివారు
TIRUMALA, 12 OCTOBER 2021: On the sixth day morning, Sri Malayappa donned the avatara of Sri Venkatadri Ramudu, to bless His devotees on Hanumantha Vahanam.
On Tuesday morning as part of ongoing annual Brahmotsavam at Tirumala, Hanumantha Vahana Seva took place.
Hanuman know for His Dasa Bhakti and Saranagati Prapatti is the servant who is being worshipped on par with His master.
While other carriers are just known for their service, it is Sri Hanuman who is revered by all and ideal for selfless and dedicated service.
Ttd chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
హనుమంత వాహనంపై వేంకటాద్రిరామునిగా శ్రీ మలయప్పస్వామివారు
తిరుమల, 2021 అక్టోబరు 12: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు వేంకటాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు.
హనుమంత వాహనం – భగవత్ భక్తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
కాగా, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనసేవ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు గజవాహనంపై శ్రీమలయప్పస్వామివారు కటాక్షిస్తారు.
వాహనసేవలలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి ప్రశాంతి రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటి ఈవో శ్రీ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.