CHAIRMAN CONSOLES INJURED WOMAN IN SLOTH BEAR ATTACK_ ఎలుగుబంటి దాడిలో గాయ‌ప‌డిన మ‌హిళకు టిటిడి ఛైర్మ‌న్ ప‌రామ‌ర్శ‌

Tirumala, 15 Jul. 19: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Monday evening consoled the woman over phone who was injured in a wild bear attack near Akasa Ganga forest range area in Tirumala.

Ms. Vijayalakshmi from Hyderaba was learnt to be wandering lone in the forest where she encountered the attack from a wild sloth bear. She was however rescued and admitted in Aswini Hospital.

The Board Chief directed the doctors to give best medication to the woman and also instructed the forest officials to bring awareness among devotees especially women not to wander lone in deep woods.

Earlier, Special Officer of Tirumala Sri AV Dharma Reddy personally visited the Aswini Hospital and consoled the injured woman.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఎలుగుబంటి దాడిలో గాయ‌ప‌డిన మ‌హిళకు టిటిడి ఛైర్మ‌న్ ప‌రామ‌ర్శ‌

జూలై 15, తిరుమ‌ల‌, 2019: తిరుమలలోని ఆకాశ‌గంగ అట‌వీ ప్రాంతంలో సోమ‌వారం ఎలుగుబంటి దాడిలో గాయ‌ప‌డి అశ్విని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విజ‌య‌ల‌క్ష్మిని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి చ‌ర‌వాణిలో ప‌రామ‌ర్శించారు.

గాయ‌ప‌డిన మ‌హిళ‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అశ్విని వైద్యాధికారుల‌ను ఛైర్మ‌న్ ఆదేశించారు. మ‌హిళ‌లు ఒంట‌రిగా అట‌వీ ప్రాంతంలోకి వెళ్ల‌రాద‌ని సూచించారు. ఈ విష‌య‌మై అధికారులు కూడా భ‌క్తుల‌కు త‌గిన సూచ‌న‌లు చేయాల‌ని కోరారు.

టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం అశ్విని ఆసుప‌త్రికి చేరుకుని గాయ‌ప‌డిన మ‌హిళ‌ను ప‌రామ‌ర్శించారు. మ‌హిళ వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. అవ‌స‌ర‌మైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌ను ఆదేశించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.