TIRUMALA MUSEUM TO GET MORE ATTRACTIVE LOOK-EO_ ఎస్వీ మ్యూజియాన్ని మరింత శాస్త్రీయంగా తీర్చిదిద్దాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 15 Jul. 19: TTD Executive Officer Sri Anil Kumar Singhal said that Sri Venkateswara Museum at Tirumala would be traditionally transformed to attract more devotees.

Speaking at a review meeting with senior officials in the TTD administrative building on Monday, he said the overhead slabs on the walker’s path at Alipiri needed revamping besides more amenities in the queue lines of Tirumala.

He directed the engineering officials to speed up all ongoing civil and electrical works.

He viewed a power point presentation of the CVSO and made several suggestions to avert pushing around of devotees
In the compartments at Tirumala.

The EO also directed engineering officials to arrange luggage counters at the Sri Padmanabha Pilgrims complex and instructed the engineering department to complete ongoing works at Seethampeta, Rampachodavaram,
Visakhapatnam, Hyderabad and other places on a war footing.

Tirumala Special Officer Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Chandrasekhar Reddy FACAO Sri O Balaji, participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ మ్యూజియాన్ని మరింత శాస్త్రీయంగా తీర్చిదిద్దాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జూలై 15, తిరుపతి, 2019: తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని మరింత మంది భక్తులు వీక్షించేందుకు వీలుగా మరింత శాస్త్రీయంగా తీర్చిదిద్దాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అలిపిరి మెట్ల మార్గంలో అవసరమైన ప్రాంతాల్లో పైకప్పునకు మరమ్మతులు చేపట్టాలన్నారు. తిరుమలలోని క్యూలైన్లు, షెడ్లను మరింత సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో జరుగుతున్న సివిల్‌, ఎలక్ట్రికల్‌ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులను దర్శనానికి వదిలే సమయంలో తోపులాట జరగకుండా చర్యలు తీసుకోవాలని సివిఎస్‌వోను కోరారు. ఇందుకు సంబంధించి సివిఎస్‌వో తయారుచేసిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను వీక్షించిన ఈవో పలు సూచనలు చేశారు. తిరుమలలోని ఆర్‌టిసి బస్టాండులోపల గల శ్రీపద్మనాభ వసతి సముదాయంలో భక్తుల లగేజి కౌంటర్‌కు కేటాయించిన ప్రదేశంలో తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సీతంపేట, రంపచోడవరం, వైజాగ్‌, హైదరాబాద్‌, కురుక్షేత్ర తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులను ఈవో సమీక్షించి వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్‌వో శ్రీగోపినాథ్‌ జెట్టి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.