CHAIRMAN, EO INSPECTS THE ARRANGEMENTS IN GALLERIES _ గ్యాలరీలలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్, ఈఓ

FOOD DISTRIBUTION COMMENCES IN THE WEE HOURS 

GALLERIES ALMOST FULL SINCE EARLY HOURS

NEARLY 1500 SRIVARI SEVAKS DEPLOYED IN MADA STREETS

SENIOR OFFICERS MONITOR THE SERVICES

TIRUMALA, 22 SEPTEMBER 2023: The distribution of Annaprasadam activity to the devotees waiting in galleries since the wee hours of Friday to catch a glimpse of the evening Garuda Vahana Seva commenced sharp at 5am. There are over 200 galleries that could accommodate above 2lakh devotees in the East-West-North-South Mada streets with the shortest one being South and the lengthiest being North. 

Between 5am and 6am, milk and coffee have been distributed followed by Upma between 6.30am and 8am. Later at 9:30am till 11am, butter milk packets were distributed. At 10am, Sambar rice, tomato rice and sweet Pongal have been distributed to the waiting pilgrims in galleries. 

In the afternoon, from 12pm to almost 3pm, over two lakh Pulihora packets were distributed to the devotees while in the evening Sundal(chana), coffee and milk are again distributed. The distribution of Annaprasadam continued till evening 6pm  in the North and East Mada street before Swami Pushkarini as they house the last galleries, before the commencement of Garuda Vahanam at 7pm. In these galleries Vegetable Kichidi has been distributed at 6pm.

TTD Chairman Sri Bhumana Karunakara Reddy along with the TTD EO Sri AV Dharma Reddy inspected the galleries and interacted with the pilgrim devotees about the distribution of food and other amenities being provided to them. The devotees also expressed immense happiness at the volume of services provided by TTD.

SERVICES OF SEVAKS LAUDED

TTD Chairman and EO lauded the impeccable services of the Srivari Sevaks who have been rendering services to the devotees waiting in the four mada street galleries since early hours with dedication and devotion. Nearly 1500 Srivari Sevaks were pressed in service for food packing, food distribution in galleries and distribution of water to the Health department. 

OFFICERS APPRECIATED

They also appreciated the vigil by senior officers who were drafted to monitor the services in all the four mada streets under the direct supervision of TTD JEO Sri Veerabrahmam with the assistance by FACAO Sri Balaji, CEO SVBC Sri Shanmukh Kumar and CE Sri Nageswara Rao in the Mada streets. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

గ్యాలరీలలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్, ఈఓ

– ఉద‌యం 5 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు

– ఉద‌య‌మే నిండిన గ్యాలరీలు

– దాదాపు 1500 మంది శ్రీవారి సేవకుల సేవ‌లు

– సీనియర్ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌

తిరుమల, 2023 సెప్టెంబరు 22: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా శుక్ర‌వారం రాత్రి జ‌రుగ‌నున్న గరుడ వాహన సేవను ద‌ర్శించేందుకు తెల్లవారుజాము నుంచే భ‌క్తులు గ్యాలరీల్లో వేచి ఉన్నారు. ఉద‌యానిక‌ల్లా గ్యాల‌రీలు భ‌క్తుల‌తో నిండాయి. ఉదయం 5 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. తూర్పు-పశ్చిమ-ఉత్తరం-దక్షిణ మాడవీధుల్లో గ‌ల 200కు పైగా గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చునే అవ‌కాశ‌ముంది.

భ‌క్తుల కోసం ఉదయం 5 నుండి 6 గంటల మధ్య పాలు, కాఫీ, ఉదయం 6.30 నుండి 8 గంటల మధ్య ఉప్మా, పొంగ‌ళి పంపిణీ చేశారు. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉదయం 10 గంటలకు సాంబార్ అన్నం, టమాటా అన్నం, స్వీట్ పొంగల్ అందించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు భక్తులకు రెండు లక్షలకు పైగా పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. సాయంత్రం సుండ‌ల్‌, కాఫీ, పాలు మళ్లీ పంపిణీ చేశారు. సాయంత్రం 7 గంటలకు గరుడవాహనం ప్రారంభం కానుండ‌గా ఉత్తర, తూర్పు మాడ వీధుల్లో సాయంత్రం 6 గంటల వరకు వెజిటబుల్ కిచిడీ పంపిణీ చేశారు.

టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, టీటీడీ ఈవో శ్రీఎవి.ధర్మారెడ్డి గ్యాలరీలను పరిశీలించి భ‌క్తులకు అందజేస్తున్న అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌రుగుదొడ్లు ఇతర సౌకర్యాలపై భక్తులతో ముచ్చటించారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గరుడ సేవను చూడటానికి తిరుమల నాలుగుమాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలసి శుక్రవారం సాయంత్రం పరిశీలించినట్టు తెలిపారు. గ్యాలరీలలో వేచి ఉండే ప్రతి భక్తుడికీ గరుడ వాహనంపై ఉన్న శ్రీ మలయప్ప స్వామివారి దర్శనం చేయించిన తరువాతే స్వామివారు ఆలయానికి వేంచేస్తారని తెలిపారు. ఇప్పటికే గ్యాలరీల్లో లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. తాను చాలామందితో మాట్లాడానని, అందరూ టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి, సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు.

శ్రీ‌వారి సేవకులకు ప్ర‌శంస‌లు

నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు తెల్లవారుజాము నుంచి అంకితభావంతో, భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల నిస్వార్థ‌సేవలను టీటీడీ ఛైర్మన్, ఈవో కొనియాడారు. దాదాపు 1500 మంది శ్రీవారి సేవకులు ఆహారపొట్లాల‌ ప్యాకింగ్, గ్యాలరీలలో అన్న‌ప్ర‌సాదాల విత‌ర‌ణ‌, ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో తాగునీటి పంపిణీ త‌దిత‌ర సేవలందించారు.

అధికారులకు అభినంద‌న‌లు

టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎఫ్‌ఏసీఏవో శ్రీ బాలాజి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్‌కుమార్, చీఫ్ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు ఆధ్వ‌ర్యంలో నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాల‌ను పర్యవేక్షించేందుకు విధులు అప్ప‌గించిన సీనియ‌ర్ అధికారుల‌ను టీటీడీ ఛైర్మ‌న్‌, ఈవో అభినందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.