CHAIRMAN EXTENDS VAIKUNTHA EKADASI GREETINGS TO DEVOTEES _ భ‌క్తుల‌కు వైకుంఠ ఏకాద‌శి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన టిటిడి ఛైర్మ‌న్‌

Tirumala, 25 Dec. 20: While extending Vaikuntha Ekadasi greetings to all the devotees of Lord Venkateswara, TTD Trust Board Chairman Sri YV Subba Reddy said, the VIP darshan is completed much earlier and Vaikuntha Dwara Darshan for common pilgrims commenced much earlier.

He sought pilgrims to follow COVID guidelines without fail and have a hassle free darshan of Lord Venkateswara. “For the first time we have opened up the Vaikuntha Dwaram for ten days for facilitating the Dwara Darshanam to more number of pilgrims”, he added.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

భ‌క్తుల‌కు వైకుంఠ ఏకాద‌శి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన టిటిడి ఛైర్మ‌న్‌

తిరుమల, 2020 డిసెంబ‌రు 25: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి శ్రీ‌వారి భ‌క్తుల‌కు వైకుంఠ ఏకాద‌శి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం ఉద‌యం ఆల‌యం వెలుప‌ల ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడారు.

ఈ ప‌ర్వ‌దినం నాడు విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం నిర్ణీత స‌మ‌యానికంటే ముందుగానే ముగించి, సామాన్య భ‌క్తుల‌కు త్వ‌ర‌గా స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభించామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించి భౌతిక‌దూరం పాటిస్తూ శ్రీ‌వారిని ద‌ర్శించుకోవాల‌ని కోరారు. ఎక్కువ మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించాల‌నే స‌దుద్దేశంతో మొద‌టిసారిగా ప‌దిరోజుల పాటు వైకుంఠ ద్వారం తెర‌చి ఉంచుతున్న‌ట్టు తెలిపారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.