CHAIRMAN INSPECTS GOSHALA_ ఎస్వీ గోశాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirupati, 8 Aug. 19: At Goshala, the Chairman inspected the cattle sheds along with Director Dr Harnath Reddy.

Later speaking to media he said there are over 2000 Desi breeds in SV Goshala. Another state of Art Goshala is coming up at Palamaner. We will take up the importance of Panchagavya products in a big way.

He also directed the officials concern to use only natural organic manures in the fodder fields.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ గోశాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుపతి, 2019 ఆగ‌స్టు 08: తిరుప‌తిలోని ఎస్వీ గోశాల‌ను టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి గురువారం సాయంత్రం ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకునేందుకు గోశాల‌ల అభివృద్ధికి పెద్ద ఏత్తున ప్ర‌ణాళిక‌లు రూపొందించి, అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. తిరుపతి, పలమనేరులోని గోశాలలో దాదాపు 2000 పశువులు ఉన్నాయని, వీటిలో పలు అరుదైన జాతుల గోవులు ఉన్నాయని వివరించారు.

దేశవాళీ గోవులను అభివృద్ధి చేసి, వాటి పంచగవ్యఉత్పత్తుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపేందుకు టిటిడి కృషి చేస్తుందన్నారు. భూమికి హని చేసే రసాయన ఏరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు ఉపయోగించాలన్నారు. ప్రభుత్వ సహకారంతో గో సంపదను కాపాడేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు.

అంత‌కుముందు ఛైర్మ‌న్ గోశాల‌లోని శ్రీ వేణుగోపాల‌స్వామివారికి పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం గోపూజ చేసి, గోశాల‌ను అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

ఛైర్మ‌న్ వెంట ఎస్వీ గోశాల సంచాలకులు డాక్టర్‌ కె.హరనాథరెడ్డి, ఇత‌ర అధికారులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.