CHAIRMAN INSPECTS AVILALA_ అవిలాల చెరువులో అభివృద్ధి ప‌నుల త‌నిఖీ చేసిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirupati, 8 Aug. 19: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Thursday evening inspected the ongoing works at Avilala tank and also SV Gosala.

During his visit to Avilala tank, he verified the works along with CE In charge Sri Ramachandra Reddy and SE 1 Sri Ramesh Reddy. Later speaking to media he said, the previous state government has decided to set up a spiritual theme park in 150acres of land at Avilala at a cost of Rs. 80crores. The tenders for Rs. 42crores were also invited. However a decision will be taken on the progress of works only after the complete board is formed.

At Goshala, the Chairman inspected the cattle sheds along with Director Dr Harnath Reddy.

Later speaking to media he said there are over 2000 Desi breeds in SV Goshala. Another state of Art Goshala is coming up at Palamaner. We will take up the importance of Panchagavya products in a big way.

He also directed the officials concern to use only natural organic manures in the fodder fields.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అవిలాల చెరువులో అభివృద్ధి ప‌నుల త‌నిఖీ చేసిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుపతి, 2019 ఆగ‌స్టు 08: తిరుప‌తిలోని అవిలాల చెరువులో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ప్ర‌భుత్వ విప్ మ‌రియు తుడా ఛైర్మ‌న్ డా.. చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డితో క‌లిసి గురువారం సాయంత్రం త‌నిఖీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ తిరుప‌తిలోని అవిలాల చెరువులో 150 ఎక‌రాల‌లో, రూ.80 కోట్ల‌తో స్పిరిచువ‌ల్ థీమ్ పార్కును ఏర్పాటు చేసేందుకు గ‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.42 కోట్లకు టెండ‌ర్లు పిలిచి, ప‌నులు చేప‌ట్టిన‌ట్లు తెలియ‌జేశారు. ఈ పార్కు శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఎంత వ‌ర‌కు ఉప‌యోగప‌డుతుంద‌నే విష‌యం పూర్తిస్థాయి టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో చ‌ర్చించి త‌దుప‌రి ప‌నుల‌కు సంబందించి తుది నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు వివ‌రించారు.

అంత‌కుముందు శ్రీ‌వేంక‌టేశ్వ‌ర ఆధ్యాత్మిక వైభ‌వ ఉద్యాన‌వ‌నం(స్పిరిచువ‌ల్ థీమ్ పార్క్‌) ప‌నుల‌ను ఛైర్మ‌న్, అధికార‌లుతో క‌లిసి ప‌రిశీలించారు.

ఛైర్మ‌న్ వెంట టిటిడి ఇన్‌చార్జ్ సిఇ శ్రీ రామ‌చంద్ర‌రెడ్డి, ఎస్ఇ-1 శ్రీ ఎం.రమేష్ రెడ్డి, ఎస్ఇ ఎల‌క్ట్రిక‌ల్ శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, ఇత‌ర అధికారులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.