CHATRA STHAPANOTSAVAM ON AUGUST 9 _ ఆగ‌స్టు 9న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

TIRUMALA, 03 AUGUST 2022: The annual festival of Chatrasthapanotsavam at Narayanagiri in Sri Padalu will be performed in Tirumala on August 9.

 

According to the temple legend, Sri Venkateswara Swamy had first landed on this Narayanagiri mountain before entering into Srivari temple, which is considered to be the highest peak point of the Seven Hills of Tirumala.

 

To mark this ceremonial occasion, Chatrasthapanotsavam is being performed every year by TTD where in a new traditional Umbrella will be erected performing special pujas.

 

There is also an interesting belief associated with this festival. As the velocity of the wind waves is heavy during this season at this point to appease the God of Wind a new umbrella is being erected on the auspicious day of Sravana Suddha Dwadasi every year in Tirumala.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 9న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

తిరుమల, 2022 ఆగ‌స్టు 03: తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగ‌స్టు 9వ తేదీ ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

పురాణ ప్రాశస్త్యం

తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవానికి సంబందించిన మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.