CHATRASTHAPANOTSAVAM IN TIRUMALA ON JULY 24_ జూలై 24న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

Tirumala, 21 July 2018: The annual Chatrasthapanotsavam will be observed at Narayanagiri Padalu in Tirumala on July 24.

Narayanagiri Padalu is considered to be the highest peak in Seshachala ranges and it is strongly believed by the devotees that the Lord stepped first on this hill point only. So it is also known as Srivari Padalu.

Procession of celestial umbrella takes place on this day and will be placed at the holy feet of Lord located in this highest peak amidst chanting of vedic mantras. Temple officials take part in this religious fete.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 24న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

జూలై 21, తిరుమల 2018: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత జూలై 24వ తేదీ మంగళవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

పురాణ ప్రాశస్త్యం

తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.

ఛత్రస్థాపనోత్సవాన్ని టిటిడి కొన్ని వందల సంవత్సరాలుగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనానికి నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థమును తీసుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రెండవ గంట తర్వాత పూజ సామాగ్రి, పుష్పాలు, నైవేద్యనికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు. రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళవాయిద్యాల నడుమ, ఏనుగులు ముందు పోగా మహా ప్రదక్షిణముగా మేదర మిట్ట చేరుకుంటారు.

అక్కడ ఏనుగులు, మంగళవాయిద్యాలను నిలిపివేసి, అర్చకులు నారాయణగిరి శిఖరం చేరుకుని శ్రీవారి పాదాలకు బంగారుబావి నుండి తెచ్చిన తీర్థముతో తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యము సమర్పిస్తారు. తదనంతరం వేదపారాయణ దారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించి, శ్రీవారి పాదాల చెంత భూచక్ర గొడుగును ప్రతిష్టించి, భక్తులకు ప్రసాదాలు పంపీణి చేస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.