NYAYA SUDHA PARAYANAM COMMENCES IN TIRUMALA TEMPLE_ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శ్రీమాన్‌ న్యాయసుధా పారాయణం

Tirumala, 21 July 2018: Following the Aradhana Mahotsavams of HH Sri Jayatheertha from Karnataka, rendition of Nyaya Sudha Parayanam commenced in Tirumala temple on Saturday.

This religious fete will be observed in two apells from July 21 to 25 and again from July 29 to August 3 under the aegis of Dasa Sahitya Project of TTD.

Meanwhile this Nyayasudha Parayanam will be recited every day in Tirumala facing Vimana Venkateswara Swamy, by eminent vedic pundits, during the above said dates.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శ్రీమాన్‌ న్యాయసుధా పారాయణం

జూలై 21, తిరుమల 2018: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీమాన్‌ న్యాయసుధా పారాయణం శనివారం ఉదయం 6.00 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని జూలై 25వ తేదీ వరకు, తిరిగి జూలై 29 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జరుగనుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి ఆలయంలోని విమాన వేంకటేశ్వరస్వామివారికి ఎదురుగా 11 మంది వేద పారాయణదారులు సకల శాస్త్రాములను పారాయణం చేశారు. ఇందులో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలను పారాయణం చేశారు. శ్రీవారి సన్నిధిలో న్యాయసుధా పారాయణం చేయడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని, అనేక సంవత్సరాలుగా టిటిడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉడిపిలోని శ్రీ కృష్ణస్వామివారి సన్నిధిలోను న్యాయసుధా పారాయణం నిర్వహిస్తున్నారు. టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థచార్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.