CHATRASTHAPANOTSAVAM IN TIRUMALA ON JULY 21 _ జులై 21న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

TIRUMALA, 17 JULY 2021: The annual Chatrasthapanotsavam will be observed in Tirumala on July 21. On this occasion, the Archakas will offer Tirumanjanam to Srivari Padalu located in Narayanagiri Mountain, considered as the highest range in Seshachala Hills.

As part of this customary festival, a new umbrella will be installed in that sacred place and special pujas will be offered.

PURANIC IMPORTANCE:

Narayanagiri Ranges are believed and worshipped as the peak where Srivaru has first stepped His divine feet before making Tirumala as His permanent residence. Commemorating the occasion, Chatrasthapanotsavam will be observed in Tirumala as an annual festival on the auspicious day of Shravana Suddha Dwadasi.

On this day, the Archakas collect water from Bangaru Baavi located inside Tirumala temple reach this place amidst Melam and Veda Mantras and perform Tirumanjanam to the Sacred Feet of Srivaru located here with these holy waters, perform puja and recite Prabandha Sattumora and return to the temple.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జులై 21న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

తిరుమల, 2021, జులై 17: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత జులై 21వ తేదీ బుధ‌వారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

పురాణ ప్రాశస్త్యం

తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.

ఛత్రస్థాపనోత్సవాన్ని టిటిడి కొన్ని వందల సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థాన్ని తీసుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రెండవ గంట తర్వాత పూజ సామ‌గ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుంటారు. రంగనాయకుల మండపం  నుండి గొడుగులతో మంగళవాయిద్యాల నడుమ మహాప్రదక్షిణంగా మేదరమిట్ట చేరుకుంటారు.

అక్కడినుండి నారాయణగిరి శిఖరం చేరుకుని శ్రీవారి పాదాలకు బంగారుబావి నుండి తెచ్చిన తీర్థంతో తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించి, శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్టించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.