JYESTABHISHEKAM IN SRI GOVINDARAJA SWAMY TEMPLE _ జూలై 19 నుండి 21వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం

TIRUPATI, 17 JULY 2021: The annual Jyesthabhishekam in Sri Govindaraja Swamy temple will be observed from July 19 to 21.

On the advent of Jyesta star in Ashada month, this annual fete commences in this ancient temple located in Tirupati. 

On July 19 Kavachadhivasam, July 20 Kavacha Pratistha and July 21 Purnahuti will be observed in the temple. Every day there will be snapana tirumanjanam will be performed to the utsava deities. In the evening, there will be unjal seva to the deities. 

Due to Covid norms, this festival will be observed in Ekantam within the temple premises itself.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూలై 19 నుండి 21వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం

తిరుపతి, 2021 జూలై 17: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 19 నుండి 21వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ మూడు రోజుల ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలోప‌ల‌ ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా జూలై 19న కవచాధివాసం, జూలై 20న కవచ ప్రతిష్ఠ, జూలై 21న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉద‌యం పాలు, పెరుగు, తేనె, చంద‌నం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో శ‌త‌క‌ల‌శ స్న‌ప‌నతిరుమంజనం నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత మ‌హాశాంతి హోమం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌ను ఆల‌యంలో విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేప‌డ‌తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.