CHATURVEDA HAVANAM COMMENCES _ ప్రయాగ్ రాజ్ లోని శ్రీవారి నమూనా ఆలయంలో శాస్త్రోక్తంగా చతుర్వేద హవనం ప్రారంభం

TIRUMALA, 15 JANUARY 2025: On Wednesday, Chaturveda Havanam commenced in Srivari temple at Prayagraj in Maha Kumbhmela.

Seeking the prosperity and wellbeing of the humanity TTD has commenced this sacred pyre which will last till February 26 under the aegis of SV Institute of Higher Vedic Studies of TTD.

HDPP Secretary Sri Sriram Raghunath, Deputy EO Sri Gunabhushan Reddy were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రయాగ్ రాజ్ లోని శ్రీవారి నమూనా ఆలయంలో శాస్త్రోక్తంగా చతుర్వేద హవనం ప్రారంభం

తిరుమల, 2025 జనవరి 15: ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభ మేళాలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూన ఆలయం చెంత బుధవారం చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ హోమాన్ని టీటీడీ ఉన్నత వేదధ్యాయన సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీ మహా కుంభ మేళా ముగిసే వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారు వేదప్రియుడు. నాలుగు వేదాలతో జరిగే యాగాలు శాంతిని, సస్యశ్యామలాన్ని, లోక కల్యాణాన్ని ప్రసాదిస్తాయి. ఈ చతుర్వేద హవనం పాపకర్మలను, జీవకోటి దు:ఖాలను, కరువుకాటకాలను నశింపచేస్తుంది.

ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.