CJI OFFERS PRAYERS _ శ్రీ వరాహ స్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

Tirumala, 5 March 2022: The Honourable Chief Justice of India, Justice NV Ramana accompanied by his spouse Smt NV Shivamala offered prayers in the Hill Shrine of Sri Venkateswara Swamy at Tirumala on Saturday evening.

 

Later they were offered Vedaseervachanam at Ranganayakula Mandapam by Vedic Pundits.

 

TTD EO Dr KS Jawahar Reddy offered Theertha Prasadams to the dignitary.

 

After darshan at Tirumala temple, they also paved a visit to Sri Varaha Swamy temple and offered prayers.

 

Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Deputy EOs Sri Lokanatham, Sri Harindranath, VGO Sri Bali Reddy were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ వరాహ స్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

తిరుమల, 2022 మార్చి 05: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శ‌నివారం రాత్రి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ ఎన్‌.వి.రమణకు చైర్మన్ శ్రీ వైవి. సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి స్వాగతం పలికారు.

స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తర్వాత చీఫ్ జస్టిస్ దంపతులు శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు.

అదనపు ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ లోకనాథం, విజివో శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది