CJI OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ ఎన్వీ రమణ

BLESSINGS OF SRIVARU RESPONSIBLE FOR MY APEX POST- CJI

TIRUMALA, 11 JUNE 2021: With the benign blessings of Sri Venkateswara Swamy I reached this apex level in my career, said the Honourable Chief Justice of India, Justice NV Ramana.

The CJI who is on a two-day maiden visit to Tirumala after taking over the reigns of the Supreme Court offered prayers in the hill shrine of Sri Venkateswara Swamy along with his family on Friday.

Speaking to SVBC after darshan he said he has come across many interesting incidents in his life. It is with the grace of Venkateswara Swamy what I am today. With His blessings I will do my best to take up the legal system to the next level”, he added.

Earlier, on his arrival at Mahadwaram, he was received by TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy and was offered traditional Isthikaphal Welcome by temple priest Sri Venugopala Deekshitulu.

Later he offered prayers in front of Sri Venkateswara Swamy. After this followed Vedaseervachanam in Ranganayakula Mandapam by Vedic pundits.

Chairman and EO offered Theertha Prasadams to the dignitary.

Among other prominent personalities who were present included local MLA and TTD Board member Sri B Karunakar Reddy, Dr Nischita, Sri Siva Kumar, Sri DP Ananta, Sri Parthasaradhi, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti and others.

Later the CJI offered Coconuts at Akhilandam and fulfilled his wish and also paid a visit to Sri Bedi Anjaneya Swamy temple.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ ఎన్వీ రమణ

తిరుమల 11 జూన్ 2021: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ రమణకు చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఇతర అర్చకులు శ్రీ ఎన్వీ రమణకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు. చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి శ్రీ ఎన్వీ రమణకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందజేశారు

శాసన సభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు డాక్టర్ నిశ్చిత, శ్రీ శివకుమార్, శ్రీ డిపి అనంత , శ్రీ పార్థ సారధి రెడ్డి,సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు.తరువాత శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.

స్వామి ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నాను : జస్టిస్ రమణ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అనంతరం శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ తో ఆయన మాట్లాడారు. తన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయన్నారు. న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్లడానికి పని చేస్తానని ఆయన తెలిపారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది