CLOSURE OF WALKERS PATH EXTENDED TILL AUG 15–PANTHER CAUGHT _ అలిపిరి న‌డ‌క దారిలో సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు అనుమ‌తి – టిటిడి ఈవో

Tirupati, August 7: The Tirumala Tirupati Devasthanams (TTD) Executive Officer Sri.I.Y.R.Krishna Rao said the walker’s path from Tirupati to  Tirumala will be closed  from 4 PM in evening to 6 AM  next morning  for one more week ( seven days) even after capture of  one panther  which caused panic
and scare among  devotees who walked to Srivari Temple in Tirumala .

The executive officer said in a statement after a review with forest,
Police and TTD officials that the walker’s path will remain closed as
one more panther (female) was still at large and traps were being laid
for capture as well.

The one week’s closure of the walker’s path to Srivari Temple at
Tirumala announced from August  Ist will expire  on Sunday , hence the
fresh decision to extend it by another seven days .The closure was
announced  after the panthers  attacked  devotees twice during the
week  before  at the 7th  KM milestone  near the deer park.

Sri Rao said that the forest officials in coordination with police and
the TTD were taking all steps to trap the animals in the forest within
the SV Wild Life Sanctuary at the earliest. Though the  walkers  path
is relatively safe  now,  the  TTD  administration did not want to
leave anything to chance  and aimed to ensure  all security steps in
place in view of the ensuing Brahmotsavams when the rush of devotes
would  be heavy .

The Chief Conservator of Forests, Tirupati Sri. Mallikarjuna Rao,
Chittoor SP, Sri. P V S Ramakrishna, Addl SP- Sri. Joga Rao, Tirupati
Urban SP- Sri Ravinder and JEO-TTDs, Dr N Yuvaraj attended the review
meeting..


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అలిపిరి న‌డ‌క దారిలో సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు అనుమ‌తి – టిటిడి ఈవో

తిరుపతి, 2010 ఆగష్టు 07: ఆగష్టు 15వ తేది వరకు అలిపిరి కాలినడక దారిలో సాయంత్రం 4 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు భక్తులను అనుమతించరాదని నిర్ణయం తీసుకొన్నట్లు తితిదే కార్యనిర్వహణ అధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు తెలిపారు. శనివారం ఉదయం ఆయన తన కార్యాలయంలో అటవిశాఖ, పోలీస్‌, తితిదే అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల ముందు ఇద్దరి చిన్నపిల్లలపై దాడి చేసిన చిరుతను అటవీశాఖ సిబ్బంది పటుకోవడం జరిగిందని తెలిపారు. దీని వయస్సు 3-31/2 సంవత్సరాలు వుంటుందని, పట్టుబడింది మగ చిరుత అని తెలిపారు.

అయితే మగ చిరుతను బంధించడం ద్వారా ఆడ చిరుత ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళవచ్చును లేక అదే దారిలో ఇబ్బందులను కలిగించే అవకాశముందని అటవీశాఖ అధికారులు స్పష్టంచేసినట్లు ఆయన తెలిపారు. రాత్రి సమయాలలో నడక దారిలో భక్తుల అలికిడి లేనిచో ఆడ చిరుత కూడా బోనులోకి వచ్చే అవకాశం వుందని, కనుక రాత్రి పూట, కాలినడకదారి మూసివేయడమే భక్తులకు సురక్షితమని ఆయన పేర్కొన్నారు.

అంతే కాకుండా ఈ వారంలో ఖచ్చితంగా ఆడ చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు తమ ప్రయత్నాల్లో వున్నారని తెలిపారు.  కనుక భక్తులు ఈ మార్పును గమనించి ఆగష్టు 15వ తేది వరకు సాయంత్రం 4 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అలిపిరి కాలినడక దారిలో వెళ్ళవద్దని కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.