CM COMPLIMENTS TTD ON TIRUCHANOOR ANNUAL FETE SUCCESS _ తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతంపై సీఎం చంద్రబాబు అభినందనలు

TIRUPATI, 09 DECEMBER 2024: The Honourable CM of Andhra Pradesh Sri N Chandrababu Naidu on Monday complimented TTD for organizing the annual Karthika Brahmotsavam at Tiruchanoor in grand and successful manner making elaborate arrangements for the scores of devotees.
 
Posting his compliments on the X platform, the CM said “Truly delighted to witness the divine grandeur of this year’s annual Karthika Brahmotsavam of Sri Padmavathi Ammavaru at Tiruchanur. This sacred festival serves as a profound symbol of the Goddess’s boundless blessings upon us, filling our hearts with spiritual fervour and allowing us to celebrate our rich traditions.
 
I would like to commend @TTDevasthanams for their meticulous arrangements, which enabled the devotees to fully immerse themselves in the divine grace and blessings of the Goddess”.
 
It may be mentioned here that this year annual Brahmotsavam at Tiruchanoor commenced on November 28 and concluded on December 6. Tens of thousands of devotees had Panchami Theertha Snanam in the holy Padma Pushkarini.
 
Under the instructions of TTD Chairman Sri BR Naidu and the  EO Sri Syamala Rao TTD has made elaborate arrangements including Annaprasadam, drinking water, sanitation, queue line management, traffic regulation in coordination with district administration and police for the big festival on par with Tirumala Srivari annual Brahmotsavam and won the hearts of devotees.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతంపై సీఎం చంద్రబాబు అభినందనలు

తిరుపతి, 09 డిసెంబర్ 2024: తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడం పట్ల ఏపీ సిఎం శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు సోమవారం టిటిడిని అభినందించారు.

X వేదికపై తన అభినందనలను పోస్ట్ చేస్తూ, “తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల దివ్య వైభవాన్ని వీక్షించడం నిజంగా ఆనందంగా ఉందన్నారు. ఈ పవిత్రమైన పండుగ తమ హృదయాలను నింపడానికి అమ్మవారి అనంతమైన అనుగ్రహానికి ప్రగాఢ చిహ్నంగా పనిచేస్తుందన్నారు. ఆధ్యాత్మిక ఉత్సాహంతో, మన సంప్రదాయాలు ఉట్టిపడేలా జరిపారన్నారు.

టిటిడి ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో ఏర్పాట్లు చేసుకుని క్షేత్ర స్థాయిలో అమలు చేయడం వల్ల భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు అందేలా చేశారని సిఎం అభినందించారు”.

ఈ ఏడాది తిరుచానూరులో వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28న ప్రారంభమై డిసెంబర్ 6న ముగిశాయి. పంచమీ తీర్థం సందర్భంగా పవిత్ర పద్మ పుష్కరిణిలో వేలాది మంది భక్తులు పంచమి తీర్థ స్నానం ఆచరించేందుకు టిటిడి ఏర్పాట్లు చేసింది.

టిటిడి ఛైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ శ్యామలరావు ఆదేశాల మేరకు టిటిడి యంత్రాంగం, జిల్లా పోలీసులు, తిరుచానూరు పంచాయతీ అధికారులు సమన్వయంతో భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పారిశుధ్యం, క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి పలు ఏర్పాట్లు చేశారు.

టిటిడి చేసిన ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేయడం పట్ల సిఎం చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది