CM LAYS FOUNDATION STONE TO RELIGIOUS THEME PARK AT AVILALA TANK_ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర ఆధ్యాత్మిక వైభ‌వ ఉద్యాన‌వ‌నం ప‌నుల‌కు గౌ.. ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న‌

Tirupati ,December 6, 2018: With the objective to transform pilgrim city of Tirupati into a spiritual hub of India, the honourable Chief Minister of AP, Sri Nara Chandababu Naidu laid foundation for Sri Venkateswara Spiritual theme park at the sprawaling Avilala grounds on Thursday evening.

At an Estimated cost of Rs. 181.13crores, TTD plans to spend Rs. Rs.80.14 crores in the first phase which includes, internal fencing and compound wall of 3.5 kms, ticket counters and parking for 496 two wheelers, 390 cars and 64 buses besides cycle tracks and walkers path etc.

Besides, the land scape of grass moulds, reserviors, reflecting the bio-diversity of Seshachala Ranges. The Astro gardens are going to be another attraction. With Parrots park , children’s park and a unique Garuda vanam coming up to add more beauty to the theme park.

Food courts, toilets, drinking water and rest rooms for visitors were also on the anvil. The goal is to transform the Avilala grounds into a devotional destination for all pilgrims who are visiting Tirupati.

Among others who took part in this fete includes, State minister Sri N Amarnath Reddy, TTD Chairman Sri P Sudhakar Yadav, TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri K S Sriniasa Raju ,Tirupati JEO Sri Pola Bhaskar, Chief Engineer Sri Chandraselhar Reddy, SE-1 Sri Ramesh Reddy, DFO Sri Phani kumar Naidu, EE Sri Nageswar Rao and others

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ‌వేంక‌టేశ్వ‌ర ఆధ్యాత్మిక వైభ‌వ ఉద్యాన‌వ‌నం ప‌నుల‌కు గౌ.. ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న‌

డిసెంబరు 06, తిరుపతి, 2018: ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తిని సుంద‌ర‌న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డంలో భాగంగా అవిలాల చెరువులో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర ఆధ్యాత్మిక వైభ‌వ ఉద్యాన‌వ‌నం(స్పిరిచువ‌ల్ థీమ్ పార్క్‌) ప‌నుల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ… శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు గురువారం సాయంత్రం శంకుస్థాప‌న చేశారు.

ఈ మొత్తం ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ.181.13 కోట్లు కాగా మొద‌టి ద‌శ‌లో రూ.80.14 కోట్ల‌తో ప‌నులు చేప‌డ‌తారు. ఇందులో ఇంట‌ర్న‌ల్ ఫెన్సింగ్ వెలుప‌ల 3 కి.మీ పొడ‌వునా ప్ర‌హ‌రీ నిర్మిస్తారు. హైవే నుండి రోడ్డు, టికెట్ కౌంట‌ర్లు, 496 ద్విచ‌క్రవాహ‌నాలు, 390 కార్లు, 64 బ‌స్సులు నిలిపి ఉంచేందుకు వీలుగా పార్కింగ్ ప్ర‌దేశం, స‌ర్వీస్ రోడ్‌, సైకిల్ ట్రాక్‌, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు.

ఇంట‌ర్న‌ల్ ఫెన్సింగ్ లోప‌ల ప‌చ్చికబ‌య‌ళ్లు, శేషాచ‌ల అడ‌వుల్లో జీవ‌వైవిద్యాన్ని ప్ర‌తిబింబించేలా ఏర్పాట్లు, జ‌లాశ‌యాలు ఉంటాయి. రాశి వ‌నం, న‌క్ష‌త్ర వ‌నం, వ‌న‌గ్ర‌హ వ‌నం, హీలింగ్ గార్డెన్‌, థీమ్ గార్డెన్‌, అట‌వీ పుష్పాల వ‌నం, వివిధ ర‌కాల పుష్ప‌వ‌నాలు, సీతాకోక‌చిలుక‌ల వ‌నం, పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక ఉద్యాన‌వ‌నం, గ‌రుడ వ‌నం ఏర్పాటు చేస్తారు.

సంద‌ర్శ‌కుల కోసం తాగునీరు, మ‌రుగుదొడ్లు, ఫుడ్‌కోర్టులు ఏర్పాటుచేస్తారు.

అంతకుముందు ముఖ్యమంత్రి గారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.

శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రి శ్రీ ఎన్.అమర్నాథరెడ్డి, శ్రీ కె.అచ్చన్నాయుడు , ఎంపి డా.ఎన్ .శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీమతి.సుగుణమ్మ, టిటిడి ఛైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రద్యుమ్నా , సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఎస్ ఈ 1 శ్రీ ఎం.రమేష్ రెడ్డి ,డిఎఫ్ వో శ్రీ ఫణికుమార్ నాయుడు , ఈఈ శ్రీ నాగేశ్వరరావు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.