PADMAVATI RIDES ON SIMHA VAHANAM_ సింహ వాహనంపై సిరులతల్లి

Tirupati, 6 Dec. 18: Goddess Padmavati was taken on a celestial ride on Simha vahanam in the Mada streets of Tiruchanoor as part of the annual Kartika Brahmosavams and blessed Her devotees.

The Lion is a symbol of braveness, strength and a favorite transport of the Goddess effectively enabling her noble task of punishing the evil and protecting the good in society.

Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy,Dy.EO Smt Jhansi Rani, AEO Sri Subramanyam and others were present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సింహ వాహనంపై సిరులతల్లి

తిరుపతి,2018 డిసెంబరు 06: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు గురువారం రాత్రి అమ్మవారు సింహ వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు.

రాత్రి 8.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీ వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.