CM OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

TIRUMALA, 28 SEPTEMBER 2022: The Honourable CM of AP, Sri YS Jaganmohan Reddy has offered prayers in the Tirumala temple on Wednesday.

 

On his arrival at Mahadwaram, he was welcomed by TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy while the traditional Isthikaphal welcome was rendered by the religious staff amidst the chanting of mantras.

 

After the darshan of Sri Venkateswara Swamy he was offered Vedaseervachanam and Thirtha Prasadams by the Vedic scholars at Ranganayakula Mandapam.

 

MPs, Ministers, Protocol dignitaries from state and district were present.

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

తిరుమల, 2022, సెప్టెంబ‌రు 28: బ్ర‌హ్మోత్స‌వాల్లో రెండో రోజైన బుధ‌వారం ఉద‌యం రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీ వేంకటేశ్వర‌స్వామివారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రివ‌ర్యుల‌కు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండలి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, అర్చ‌కులు ఇస్తిక‌ఫాల్ స్వాగ‌తం ప‌లికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

ద‌ర్శ‌నానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి తో కలిసి ముఖ్యమంత్రివర్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.

ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రివ‌ర్యులు

రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల‌లో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని ప్రారంభించారు. ఈ భ‌వ‌న నిర్మాణానికి రూ.23 కోట్లు విరాళంగా అందించిన దాత శ్రీ ముర‌ళీకృష్ణ‌ను ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రివ‌ర్యులు అభినందించారు. ఆ తరువాత రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన విపిఆర్ విశ్రాంతి గృహాన్ని ముఖ్యమంత్రివ‌ర్యులు ప్రారంభించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.