జూలై 19న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కొబ్బరిచిప్పల సేకరణకు రీటెండర్
జూలై 19న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కొబ్బరిచిప్పల సేకరణకు రీటెండర్
తిరుపతి, 2019 జూలై 08: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 2019-20వ సంవత్సరానికి గాను కొబ్బరిచిప్పల సేకరణకు గాను జూలై 19వ తేదీన రీటెండర్ కమ్ వేలం జరుగనుంది.
ఆసక్తి గలవారు తిరుచానూరులోని డెప్యూటీ ఈవో కార్యాలయంలో రూ.500/- డిడి తీసి టెండర్ షెడ్యూల్ పొందొచ్చు. టెండర్‌లో పాల్గొనదలచినవారు రూ.40 వేలు ఇఎండిని ఈవో, టిటిడి పేరిట డిడి తీసి టెండర్ షెడ్యూల్‌కు జతపరచాలి. జూలై 19వ తేదీన మధ్యాహ్నం 1 గంట వరకు టెండర్ షెడ్యూల్ పొందొచ్చు. సీల్డ్ కవర్లను మధ్యాహ్నం 2.30 గంటల వరకు టెండరు బాక్సులో వేయవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీల్డ్ టెండర్లను తెరుస్తారు.
ఇతర వివరాలకు తిరుచానూరులోని ఆలయ డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.