TTD CANCELS DD AND SSD TOKENS ON JULY 16_ జూలై 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల రద్దు

Tirumala, 8 July 2019: In view of full lunar eclipse – Sampoorna Chandra Grahanam, TTD has cancelled issuance of Divya Darshanam and Slotted Sarva Darshanam tokens to the pilgrims on July 16.

According to almanac, the lunar eclipse falls between 1.31am and 4.29am on July 17. But since it is a traditional practice to close the Tirumala temple six hours prior to eclipse, the temple remains closed from 6pm of July 16 till 5am of July 17.

To avoid any inconvenience to the multitude of visiting pilgrims, TTD has taken the decision to cancel the DD and SSD tokens on July 16 as the temple remains opens only for five hours on that day between 12 noon to 5pm following eclipse.

Both the vaikuntham queue complexes will also be kept empty as Annaprasadam will also be not served on that day following eclipse and temple doors closes at 7pm.

While on July 17, when the temple door opens at 5am after the Grahanam, suddhi punyahavachanam are performed while Suprabhatam, Tomala, Archana and Koluvu will be performed in Ekantam. TTD has cancelled Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deepalankara Seva in connection with Anivara Asthanam on July 17.

On July 17, the Anivara Asthanam – annual budgeting festival of the temple takes place between 7am and 9am at Bangaru Vakili. The Sarva Darshanam commences only from 12noon onwards.

Keeping all these in view, the devotees are requested to plan their pilgrimage to Tirumala accordingly to avoid any inconvenience.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జూలై 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల రద్దు

జూలై 08, తిరుమల, 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, చంద్రగ్రహణం కారణంగా జూలై 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను టిటిడి రద్దు చేసింది.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కారణంగా జూలై 16న ఉదయం 6 నుండి మధ్యాహ్నం12 గంటల వరకు సర్వదర్శనం ఉండదు. చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 5 గంటల వరకే కంపార్ట్‌మెంట్లలోనికి భక్తులను అనుమతిస్తారు. రాత్రి 7 నుంచి మరుసటిరోజు ఉదయం 11 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేస్తారు. ఈ నేపథ్యంలో జూలై 16న మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల వరకు కేవలం 5 గంటలు మాత్రమే భక్తులకు దర్శన సమయం ఉంటుంది. ఈ కారణంగా దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరడమైనది.

జూలై 17న ఉదయాత్పూర్వం 1.31 నుండి 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. జూలై 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా చేపడతారు. ఉదయం 12 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.