COME OUT WITH PLANS TO WIDEN ROAD AT MOKALIMETTU-EO_ సప్తగిరి మాసపత్రికను పాఠకులకు సకాలంలో అందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati,03 December 2018: TTD EO Sri Anil Kumar Singhal instructed the engineering officials to come out with an action plan to widen the pedestrian road from Mokali mettu to Sri Lakshmi Narasimha Swamy temple
in First Ghat road.

During the senior officers review meeting held at the Conference Hall in TTD Administrative Building in Tirupati on Monday, he directed the concerned to take up the development of SV Museum works in a phase manier in Tirumala. He also instructed them to remove the unnecessary sign boards in Tirumala.

He later directed them complete the construction of pilgrims amenities complex within two months in Tiruchanoor. And also to develop the parking slot in Govinda raja Swamy temple in Tirupati on time.

The EO directed the concerned to ensure that Sapthagiri magazine reach the subscriber without delay as it has huge reception among devotees.

Later he also reviewed on the progress of works at Vontimitta.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti and other senior officers were also present

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సప్తగిరి మాసపత్రికను పాఠకులకు సకాలంలో అందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 డిసెంబరు 03: ధర్మప్రచారంలో భాగంగా ఆరు భాషల్లో ముద్రిస్తున్న సప్తగిరి మాసపత్రికకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందని, పాఠకులకు సకాలంలో చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సప్తగిరి మాసపత్రికను మరింత మంది పాఠకులకు చేర్చాలని సూచించారు. చందాదారుల వివరాలను డిసెంబరు చివరినాటికి సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్‌ చేసుకోవాలన్నారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం వద్ద పార్కింగ్‌, కల్యాణవేదిక, ఆలయ పరిసరాల్లో పచ్చదనం పెంపు ఇతర ఇంజినీరింగ్‌ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి యాత్రికుల వసతి సముదాయాన్ని రెండు నెలల్లోపు పూర్తి చేయాలన్నారు. శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాల్లో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

శ్రీవారి ఆలయంలో ప్రసాదం స్వీకరించే ప్రాంతంలో భక్తుల కోసం షెడ్డు ఏర్పాటు చేయాలన్నారు. సర్వదర్శనం టోకెన్లు పొందే భక్తుల సౌలభ్యం మేరకు ఎప్పటికప్పుడు కోర్‌ కమిటీ ప్రణాళికలు రూపొందించాలని ఈవో ఆదేశించారు. టిటిడి ఆస్తుల వివరాలను కంప్యూటరీకరించాలన్నారు. తిరుమలలో భక్తులకు ఉపయోగం కాని సూచికబోర్డులను తొలగించాలన్నారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో ఒక్కో ఫ్లోర్‌ను దశలవారీగా అభివృద్ధి చేయాలని సూచించారు. 2019 డైరీలు, క్యాలెండర్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కాలినడక భక్తుల సౌలభ్యం కోసం మోకాళ్లమిట్ట నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం వరకు రోడ్డు విస్తరణ కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎఫ్‌ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.