COMMENDABLE PERFORMANCES BY TTD VIGILANCE OFFICERS IN WORLD POLICE GAMES MEET _ ప్రపంచ పోలీస్ క్రీడల్లో టీటీడీ సెక్యూరిటీ,విజిలెన్స్అధికారుల అద్భుత విజయం

WINS GOLD AND BRONZE FOR THE COUNTRY

Tirumala, 04 July 2025: In the World Police and Fire Games 2025 meet held at Birmingham, USA.

TTD vigilance officers duo won the prestigious Gold and Bronze medals for the country.

In the 45 plus Singles’ Tennis TTD VGO Security wing of Tirumala Sri A Surendra won the Gold medal while in 55 plus Singles’ Tennis, the Tirumala Vigilance Wing Officer Sri NTV Ram Kumar won the Bronze medals for the country.

In a rare achievement, the duo won the prestigious medals representing India in a biannual event wherein around 9000 athletes from police and Fire Departments hailing from 80 countries across the world participated in this Games meet.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రపంచ పోలీస్ క్రీడల్లో టీటీడీ సెక్యూరిటీ,విజిలెన్స్ అధికారుల అద్భుత విజయం

దేశానికి బంగారు, కాంస్య పతకాలు టీటీడీకి గర్వకారణం

విజేతలను అభినందించిన టీటీడీ చైర్మన్, ఈవో

తిరుమల, 2025 జూలై 04: అమెరికాలోని బర్మింగ్‌హామ్ నగరంలో జరిగిన ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ – 2025 పోటీల్లో టీటీడీ సెక్యూరిటవిజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు అరుదైన క్రీడా ప్రతిభను ప్రదర్శిస్తూ అద్భుత విజయాలు సాధించి జాతీయ మువ్వెన్నల పతాకాన్ని రెపరెపలాడించారు.

45 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో టీటీడీ విజీవో శ్రీ ఎ.సురేంద్ర స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, 55 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో వీజీవో  శ్రీ ఎన్టీవీ రామ్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు విజేతలను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల పోలీస్, ఫైర్ విభాగాల నుంచి 9,000 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ద్వైవార్షిక పోటీల్లో టీటీడీ అధికారుల విజయాలు దేశానికే గర్వకారణమని, టీటీడీకి ఇది ఒక గొప్ప గౌరవంగా నిలిచిందని కొనియాడారు.

అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీ.వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలు కూడా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జాతీయ స్థాయి విజయం టీటీడీ సెక్యూరిటీ, విజిలెన్స్ విభాగం లోని అధికారుల నైపుణ్యాన్ని, నిబద్ధతను చాటిందని,  ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ప్రతిష్టను మరింత పెంచేలా ఈ విజయం తోడ్పడిందని పేర్కొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.