COMPENSATION DISBURSED _ తొక్కిసలాటలో గాయపడ్డ బాధితురాలికి పరిహారం పంపిణీ

Tirumala, 31 January 2025: TTD Chairman Sri BR Naidu along with some board members have given compensation to the injured devotee in the Tirupati stampede incident. 

They distributed a DD for Rs. 2lakh to Smt G. Shailaja of Sarvarajupeta Colony, Veerappanayanapalli Mandal, Kadapa District.

Chairman BR Naidu, members Sri Jyotula Nehru, Sri Santaram presented the DD to the victim at the Chairman camp office in Tirumala on Friday.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తొక్కిసలాటలో గాయపడ్డ బాధితురాలికి పరిహారం పంపిణీ

తిరుమల, 31 జనవరి 2025: తిరుపతిలో జనవరి 8న జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన భక్తురాలికి టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, కొంతమంది బోర్డు సభ్యులు పరిహారాన్ని శుక్రవారం అందించారు.

కడప జిల్లా వీరపునాయనపల్లి మండలం, సర్వరాజుపేట కాలనీకి చెందిన బాధితురాలు శ్రీమతి జి. శైలజకు రూ. 2 లక్షల డిడిని పంపిణీ చేశారు.

తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో బాధితురాలికి చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ శాంతారాం డిడిని అందజేశారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది