COMPLETE THE REPAIRS OF PUBLIC TOILETS BEFORE BTUs-SO_ బ్రహ్మోత్సవాల్లోపు మరుగుదొడ్ల మరమ్మతులు పూర్తి చేయాలి : తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
Tirumala, 20 Aug. 19: The repair works of all the public toilets in Tirumala should be completed before annual brahmotsavams and should cater to the demand of the pilgrims during the occasion, said Tirumala Special Officer, Sri AV Dharma Reddy.
During the weekly review meeting of Senior Officers held at Annamaiah Bhavan in Tirumala on Tuesday, the SO instructed the CE Sri Ramachandra Reddy to ensure that all cottages and toilet blocks are free from repairs and suffice the needs of the multitude of visiting pilgrims during annual fete.
He also instructed that henceforth all the senior officers who have adopted each area to ensure overall development shall be reviewed from next week on wards for betterment of the system. The SO also reviewed on the pending civil, electrical and water works in Tirumala along with sanitation and procurement of ingredients required to make prasadams.
Additional CVSO Sri Venkata Siva Kumar Reddy, GM Transport and IT wing head Sri Sesha Reddy, GM Procurement Sri Jagadeeshwar Reddy, Health Officer Dr RR Reddy were also present.
Later he inspected the Kaustubham, Panchajanyam rest houses and also the cabling work which is underway in four mada streets along with CE and other officials.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బ్రహ్మోత్సవాల్లోపు మరుగుదొడ్ల మరమ్మతులు పూర్తి చేయాలి : తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
తిరుమల, 2019 ఆగస్టు 20: శ్రీవారి బ్రహ్మోత్సవాలలోపు తిరుమలలో అవసరమైన ప్రాంతాల్లో మరుగుదొడ్ల మరమ్మతులను పూర్తి చేయాలని టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సివిల్, ఎలక్ట్రికల్, వాటర్‌వర్క్స్ పనులు చేపట్టాలని, అన్ని ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. లడ్డూప్రసాదం తయారీకి సరుకుల కొరత లేకుండా ముందస్తుగా సమకూర్చుకోవాలని ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ శ్రీ జగదీశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. నాణేల పరకామణిలో ఎలాంటి జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రిసెప్షన్ -1, రిసెప్షన్ -2 పరిధిలోని విశ్రాంతి గృహాలు, వసతి గదుల్లో తరచూ తనిఖీలు చేపట్టి ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఎంబిసి-34 తదితర విచారణ కార్యాలయాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు స్వైపింగ్ యంత్రాలను వినియోగించాలని సూచించారు. ప్రాంతాల వారీగా సీనియర్ అధికారులకు వసతి సముదాయాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని, ఈ పనుల ప్రగతిపై వచ్చే వారం నుండి సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ జి.రామచంద్రారెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్టేట్ అధికారి శ్రీ విజయసారధి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, ఆర్యోగశాఖాధికారి శ్రీ ఆర్.ఆర్.రెడ్డి, అన్నదానం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.