TTD SPECIAL OFFICER EXTENSIVE INSPECTIONS AT TIRUMALA_ తిరుమ‌ల‌లో ప్ర‌త్యేకాధికారి విస్తృత త‌నిఖీలు

Tirumala, 20 Aug. 19: TTD special Officer Sri AV Dharma Reddy made extensive inspections of TTD rest houses, mada streets, Vaikuntam queue complexes on Tuesday and directed officials to take various devotee friendly steps.

During his visit to Panchajanya, Kausthubham, HVC rest houses he instructed officials to take up change of linen and also repairs. He also interacted with devotees at the panchajanya rest House and received the feedback from them.

Along with CVSO Sri Gopinath Jatti he inspected the mada streets, ugranam Ananthalwar Thota, Vaikuntam queue Complex-2 and Divya darshan complexes and made suitable suggestions to officials on underground cable works and darshan line Queue management.

TTD Chief Engineer Sri Ramachandra Reddy, SE electrical Sri Venkateswarlu, Special grade DyEO Smt Parvati and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో ప్ర‌త్యేకాధికారి విస్తృత త‌నిఖీలు

తిరుమల, 2019 ఆగ‌స్టు 20: టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి మంగ‌ళ‌వారం తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాల్లో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. ముందుగా పాంచ‌జ‌న్యం, కౌస్తుభం, హెచ్‌విసి విశ్రాంతి గృహాల‌ను ప‌రిశీలించారు. ఆయా ప్రాంతాల్లో అవ‌స‌ర‌మైన చోట ప‌రుపులు, దిండ్లు మార్చాల‌ని, పైపులైన్ల లీకేజీల‌ను అరిక‌ట్టాల‌ని, స్నాన‌పు గ‌దుల డోర్లు మార్చాల‌ని సూచించారు. పాంచ‌జ‌న్యం గ‌దుల్లోని సౌక‌ర్యాల‌పై ప‌లువురు భ‌క్తుల‌తో మాట్లాడ‌గా వారు సంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఆ త‌రువాత సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టితో క‌లిసి ప్ర‌త్యేకాధికారి శ్రీ‌వారి ఆల‌య మాడ వీధులు, ఉగ్రాణం, అనంతాళ్వార్ తోట‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, దివ్య‌ద‌ర్శ‌నం కాంప్లెక్స్‌ త‌దిత‌ర ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. మాడ వీధుల్లో భూగ‌ర్భ కేబుల్ ప‌నుల‌ను ప‌రిశీలించి ఇంజినీరింగ్ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో కంపార్ట్‌మెంట్ల నుండి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి వ‌దిలే విధానాన్ని ప‌రిశీలించారు.

ప్ర‌త్యేకాధికారి వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ జి.రామ‌చంద్రారెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, ఇఇ శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, డిఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీమ‌తి స‌ర‌స్వ‌తి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఎవిఎస్వోలు శ్రీ చిరంజీవి, శ్రీ గంగ‌రాజు త‌దిత‌రులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.