COMPLETE TTD MODEL TEMPLE WORKS FOR MAHA KUMBH MELA SOON – JEO (H&E) _ మహాకుంభమేళకు టిటిడి తరుపున నమూనా ఆలయం పనులు పూర్తి చేయండి – టిటిడి జేఈవో శ్రీమతి ఎం. గౌతమి
Tirupati, 26 December 2024: TTD JEO Smt. Gautami has directed the officials concerned to complete the construction works of the TTD model temple for the upcoming Mahakumbh Mela in Prayagraj (Allahabad) in Uttar Pradesh India on a fast pace.
Addressing a review meeting with the officials in the meeting hall of the TTD Administrative building on Thursday evening the JEO said that in the context of the Mahakumbh Mela to be held in Prayagraj (Allahabad) in Uttar Pradesh from January 13, 2025 to February 26, 2025, as per the decision of the TTD Governing Council, necessary arrangements should be made for the Kainkaryams being held at the TTD replica Temple on the orders of EO Sri Syamala Rao.
She said that this year’s Mahakumbh Mela is being held in Prayagraj in the context of the Pushkarams being held once every 12 years.
The officer also said that in the context of setting up a model Sri Venkateswara temple in such a holy place, TTD is making elaborate arrangements to enhance spirituality.
TTD is providing an opportunity to the devotees who come to Prayagraj to have a darshan of Swamy.
She said that on January 12, the Swamy will be offered Samprokshanam and other programs will be held and said that all services from Suprabhata Seva to Ekantha Seva will be held from the January 13 onwards with utmost devotion for the sake the devotees especially the North Indian devout.
The JEO instructed the officers concerned to make elaborate arrangements to provide Annaprasadam and also to diatribute Laddu Prasadam to the devotees who come for the darshan of Srivaru in the model Temple.
She also reviewed on the HDPP, SV College of Music and Dance and Annamacharya Projects activities during the Mela on behalf of TTD.
Among others, she asked to set up posters and flexes in major areas, print books containing the main events including the emergence of Swamy varu in Hindi and English and distribute them widely to broadcast promos through SVBC and TTD social media from now on.
One of the Chief Priests of Tirumala Temple Sri Venugopala Deekshitulu said that the Kainkaryams will be held at the replica temple from January 13th.
He urged all devotees to visit the temples at the and seek His divine blessings.
Later he said that Vastu Homas and special puja programs will be held on January 12th for the purification of the place.
SEs Sri Jagadeeshwar Reddy, Sri Venkateswarlu, HDPP Secretary Sri Raghunath, DPP Program Officer Sri Rajagopal, Deputy EOs Sri Selvam, Sri Sivaprasad, Smt. Prashanthi, Sri. Gunabhushan Reddy, EEs Surendranath Reddy, VGO Smt. Sadalakshmi were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
\
మహాకుంభమేళకు టిటిడి తరుపున నమూనా ఆలయం పనులు పూర్తి చేయండి – టిటిడి జేఈవో శ్రీమతి ఎం. గౌతమి
తిరుపతి, తేది, 26.12.2024: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జరుగనున్న మహాకుంభమేళకు టిటిడి తరుపున నమూనా ఆలయ నిర్మాణం పనులను సకాలంలో పూర్తి చేయాలని టిటిడి తిరుపతి జేఈవో శ్రీమతి ఎం. గౌతమి అధికారులను కోరారు. టిటిడి పరిపాలనా భవనంలోని మీటింగ్ హాలులో గురువారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు మహాకుంభ మేళలో జరుగనున్న నేపథ్యంలో టిటిడి పాలకమండలి నిర్ణయం మేరకు ఈవో శ్రీ శ్యామలరావు ఆదేశాలతో తిరుమల స్వామివారి ఆలయంలో జరుగుతున్న కైంకర్యాలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 12 సంవత్సరాలకోసారి పుష్కారాలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఏడాది మహా కుంభమేళ ప్రయాగ్ రాజ్ లో జరుగుతోందన్నారు. అలాంటి పవిత్ర పుణ్య స్థలంలో స్వామి వారి నమునా ఆలయం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరింత ఆధ్యాత్మికతను పెంచేందుకు టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేస్తోందన్నారు. ప్రయాగ్ రాజ్ కు విచ్చేసే అశేష భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం టిటిడి కల్పిస్తోందన్నారు. జనవరి 12 వ తేది స్వామివారికి సంప్రోక్షణ చేసి, అచల ప్రతిష్ట తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులకు పవిత్రతతో 13వ తేది నుంచి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు జరుగనున్నాయన్నారు. మహాకుంభమేళ అంటేనే కొన్ని సంవత్సరాపాటు తపస్సు చేస్తున్న మునులు, సాధువులు పవిత్ర గంగాజలంలో స్నానం ఆచరించి పుణ్యం పొందేందుకు వస్తారని, అలాంటి పవిత్ర స్థలంలో స్వామి వారి ఆలయాన్నిఏర్పాటు చేసుకుని స్వామివారి సేవలను భక్తులకు అందించేలా టిటిడి ఏర్పాట్లు చేస్తోందన్నారు.
శ్రీవారి నమూనా ఆలయంలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అవసరమైన అధికారులను, సిబ్బందిని డిప్యూటేషన్ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి రాజీ లేకుండా పుష్ప, విద్యుత్ అలంకరణలు చేపట్టాలన్నారు. హెచ్ డి పిపి , ఎస్వీ సంగీత కళాశాల, అన్నమయ్య ప్రాజెక్ట్ నుంచి అవసరమైన కళాకారులతో సంగీత, సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన ప్రాంతాలలో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేలా ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. స్వామి వారి ఆవిర్భావం నుంచి ప్రధాన ఘట్టాలతో కూడిన పుస్తకాలను హిందీ, ఇంగ్లీష్ భాషలలో ముద్రించి భక్తులకు విరివిగా పంపిణీ చేయాలన్నారు. ఎస్వీబీసీ, టిటిడి సోషల్ మీడియా ద్వారా ఇప్పటి నుంచే ప్రోమోలు ప్రసారం చేయాలన్నారు.
తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ టిటిడి అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీవారి నమునా ఆలయాన్ని ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. జనవరి 13వ తేది నుంచి స్వామి వారి కైంకర్యాలు జరుగుతాయన్నారు. భక్తులు అందరూ నమునా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జనవరి 12 వ తేదిన స్థల శుద్ది కోసం వాస్తు హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో డిపిపి సెక్రటరీ శ్రీ రఘునాథ్, డిపిపి ప్రోగ్రాం ఆఫిసర్ శ్రీ రాజగోపాల్. డిప్యూటీ ఈవోలు ఆర్. సెల్వం, శివప్రసాద్, ప్రశాంతి, గుణభూషణ్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు. ఎస్.ఈ శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ సురేంద్ర రెడ్డి, విజీవో శ్రీమతి సదాలక్ష్మీ వర్చువల్ ద్వారా ప్రయాగ్ రాజ్ నుంచి జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది