CONDUCT TIRUCHANOOR FEST AKIN TO TIRUMALA -TTD EO _ తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు- టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
Tirupati, 21 November 2024: The annual Brahmotsavam at Tiruchanoor should be conducted on par with Tirumala Brahmotsavams, directed TTD EO Sri J Syamala Rao to the officials of various departments.
A review meeting took place at the Meeting Hall of the Administrative Building in Tirupati on Thursday evening in connection with the Navahnika Karthika Brahmotsavam of Sri Padmavati Ammavaru from November 28 to December 06.
As a part of this, the EO directed the officials concerned that precautions should be taken regarding sanitation by coordinating with local panchayat officials.
On the Medical front he said First Aid centers, Ambulances with required staff shall be kept ready.
As a security measure, CCTV cameras shall be installed at different vital places in coordination with the local police.
He said, steps should be taken to ensure that Anna Prasadam is being provided to all devotees in an uninterrupted manner.
Stressing the quality in cultural programs he said unique dance and bhajan troupes shall be invited.
Regarding Engineering works he said whitewash, painting, flexi boards and arches at important places, Harathi points, barricades, to be completed on time.
He also instructed that the flower exhibition by the Garden wing and electrical illumination should be attractive, matching the occasion.
JEO Sri Veerabrahmam, CVSO Sri Sreedhar, FACAO Sri Balaji, CE Sri Satyanarayana, DyEO PAT Sri Govindarajan and other officers were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
– పంచమితీర్థానికి విస్తృతంగా ఏర్పాట్లు
– టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
తిరుపతి, 21 నవంబర్ 2024: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం సాయంత్రం ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థం రోజు భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హోల్డింగ్ పాయింట్లలో ఉండే వేచి ఉండే భక్తులకు సౌకర్యవంతంగా మంచినీరు, అల్పాహారంతో పాటు మరుగుదొడ్లను కూడా అందుబాటులో ఉంచేందుకు ముందస్తుగానే ప్రణాళిక చేసుకోవాలన్నారు. హోల్డింగ్ పాయింట్ల వద్ద అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.
ఆరోగ్యశాఖ అధికారులు పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుని స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వైద్య విభాగం అధికారులు ప్రథమ చికిత్స కేంద్రాలను, అంబులెన్సులను ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. సెక్యూరిటీ విభాగం అధికారులు సీసీ కెమెరాలను, అవసరమైనంత సిబ్బందిని ఏర్పాటు చేసుకుని స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాంచారు.
భక్తలందరికీ అన్నప్రసాదం విరివిగా అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా నిర్వహించే స్టేజ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నాణ్యమైనవిగా ఉండాలని సూచించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వైట్ వాష్, కలర్ పెయింటింగ్, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్చిలు ఏర్పాటు చేసి హారితి పాయింట్స్ కోసం లైన్ లు, బారికేడ్లు, చైన్ లింక్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తిరుచానూరులో ఫల, పుష్ఫ ప్రదర్శనను భక్తులు ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ శ్రీధర్, ఎఫ్ఏసీఏఓ శ్రీ బాలాజీ, సిఈ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో ఈవో శ్రీ గోవింద రాజన్, ఇతర తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.