CRITICAL SPINAL CORD SURGERIES AT BIRRD- A BOON TO THE NEED POOR PATIENTS _ బర్డ్ లో ఆధునిక పరిజ్ఞానంతో ఉచితంగా సంక్లిష్ట ఆపరేషన్లు

Tirupati, 25 September 2021: A critical Spinal cord operation was performed free of cost by specialists with the sophisticated state-of-art equipment installed in the BIRRD Hospital and it is a boon to poor and needy patients by Srivaru said specialist surgeon Dr Surya Prakash.

The eminent doctor who was in BIRRD on the invitation of TTD addressed a media conference at the hospital on Saturday evening along with OSD Dr Reddappa Reddy.

He said he has been performing backbone and spinal cord operations for the last 25 years and advent of state of art medical equipment has now made all surgeries without complications and avert paralysis in the patients.

Elaborating further, he said all such operations were performed under Neuro Monitoring Technology in consultation with experts from Chennai based corporate hospital.

Contending that the technology and equipment available at BIRRD hospital is matchless and even not available at many corporate hospitals across the country. Dr Surya Prakash said surgeries costing lakhs of rupees in corporate hospitals is being offered almost free to poor at BIRRD.

BIRRD Hospital OSD Dr Reddappa Reddy said the hospital had received a donation of Rs.15 crore worth equipment so far with which specialized operations for poor shall be performed by inviting ortho specialists from all over the country.

He said TTD is in consultation with International companies like Auto-lock and Endolite companies to manufacture world-class artificial limbs in BIRRD in the next few months.

The OSD of the hospital said henceforth BIRRD is also introducing facility to provide hassle-free OP services with 33% through phone, 33% via website and 34% physically and that anybody could get any speciality operations within 90 days.

Along with Dr Surya Prakash, Bone marrow expert Dr E Krishna Kiran, Brigadier Agarwal from Raipur conducted the critical operations on Saturday, said Dr Reddeppa Reddy.

BIRRD Doctors Dr Naresh Kumar, Dr Ramamurthy and Dr Venugopal were also present.

 According to the patient’s father Sri B Srinivas of Muthkuru village, Kalakada Mandal, Chittoor district, his daughter has been suffering from spinal cord discomfort from the past three years. However, with the blessings of Srivaru, his daughter got successfully operated free of cost at BIRRD while the actual cost of the surgery outside is almost Rs.5lakhs which he could not afford. He thanked the doctors and nursing staff at BIRRD for the special care and medication they have extended to his daughter during surgery time.

Similarly, Sri K Chinna Rao, Chellandi village, Tekkali mandal of Srikakulam district and Sri Brahmam of Nandivargam village, Panyam mandal of Kurnool district narrated the woes of their children and how the critical surgeries were performed to them free of cost at BIRRD hospital with the special care shown by doctors and paramedical staff. “Now our children are free from their ailments with the benign blessings of Sri Venkateswara Swamy”, they expressed with elation.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బర్డ్ లో ఆధునిక పరిజ్ఞానంతో ఉచితంగా సంక్లిష్ట ఆపరేషన్లు

– ఇది పేదలకు శ్రీవారు ఇచ్చిన గొప్పవరం

వెన్నుపూస సంక్లిష్ట శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ సూర్య ప్రకాష్

తిరుపతి 25 సెప్టెంబర్ 2021: బర్డ్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అత్యంత సంక్లిష్టమైన వెన్నుపూస ఆపరేషన్లు ఉచితంగా చేయడం పేద ప్రజలకు శ్రీ వేంకటేశ్వర స్వామి అందించిన వరమని ప్రముఖ వెన్నుపూస సంక్లిష్ట ఆపరేషన్ల నిపుణులు డాక్టర్ సూర్య ప్రకాష్ చెప్పారు.

టిటిడి ఆహ్వానంపై బర్డ్ ఆస్పత్రిలో సంక్లిష్టమైన వెన్నుపూస ఆపరేషన్లు ఉచితంగా చేయడానికి వచ్చిన ఆయన బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచవేటి రెడ్డెప్ప రెడ్డి తో కలిసి శనివారం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా డాక్టర్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ, తాను గత 25 సంవత్సరాలుగా సంక్లిష్ట వెన్నుపూస ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ 25 సంవత్సరాల కాలంలో అనేక అధునాతన వైద్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల వెన్నుపూస వంకర ఆపరేషన్ లు నిర్వహించినా పెరాలసిస్ వచ్చే ప్రమాదం దాదాపుగా లేకుండా పోయిందన్నారు. చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి తో ఒప్పందం కుదుర్చుకుని బర్డ్ లో ఇలాంటి సంక్లిష్టమైన వెన్నుపూస ఆపరేషన్లు చేసేప్పుడు న్యూరో మానిటరింగ్ పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నామని చెప్పారు. ఈ పరిజ్ఞానం దేశంలోని చాలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా లేదని డాక్టర్ సూర్యప్రకాష్ చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు పేదలకు తన ద్వారా ఇలాంటి సేవలందించడం దేవుడు తనకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆపరేషన్లు బర్డ్ ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా చేస్తున్నారని, ఇది పేద ప్రజలకు శ్రీ వేంకటేశ్వర స్వామి ఇచ్చిన గొప్ప వరమని ఆయన అన్నారు.

బర్డ్ ఆస్పత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచవేటి రెడ్డప్ప రెడ్డి మాట్లాడుతూ, ఐదు నెలల కాలంలో బర్డ్ కు సుమారు 15 కోట్ల విలువచేసే యంత్ర సామగ్రి విరాళంగా వచ్చిందన్నారు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో సహకారంతో ఆస్పత్రిలో రోగులకు అనేక ఆధునిక వైద్య సేవలు, వసతులు అందుబాటులోకి తెచ్చామని ఆయన చెప్పారు. దేశంలోనే పేరెన్నిక గన్న ప్రముఖ వైద్య నిపుణులను పిలిపించి పేదలకు సంక్లిష్టమైన ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన వైద్య నిపుణులను ఆహ్వానించి పేదలకు ఉచిత ఆపరేషన్ లతోపాటు, బర్డ్ ఆసుపత్రి లోని జూనియర్ డాక్టర్లకు వృత్తి నైపుణ్యం పెంచే కార్యక్రమాలు కూడా చేస్తామన్నారు. కృత్రిమ అవయవాల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన ఆటో బక్, ఎండో లైట్ కంపెనీలతో చర్చలు జరిపామని, నెల రోజుల్లో బర్డ్ లో ప్రపంచ స్థాయిలో అత్యున్నతమైన కృత్రిమ అవయవాలను అందించే కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. బర్డ్ ఆసుపత్రి లో ఓపి ల కోసం రోగులు ఇబ్బంది పడకుండా, రాబోయే రోజుల్లో 33శాతం ఫోన్ ద్వారా 33 శాతం వెబ్ సైట్ ద్వారా, 34 శాతం ఓపి లు నేరుగా అందించే ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి చెప్పారు. బర్డ్ లో సర్జరీల కోసం ఎవరు ముందు వస్తే వారికే సర్జరీల తేదీలు ఇస్తున్నామన్నారు. 90 రోజుల్లోపు సర్జరీ చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. డాక్టర్ సూర్య ప్రకాష్ తో పాటు, ప్రముఖ తుంటి మార్పిడి సర్జరీ నిపుణులు డాక్టర్ ఈ. కృష్ణ కిరణ్ , రాయ్ పూర్ కు చెందిన ప్రముఖ వైద్యులు బ్రిగేడియర్ అగర్వాల్ శనివారం సంక్లిష్ట సర్జరీలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. మీడియా సమావేశంలో డాక్టర్ నరేష్ కుమార్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.

* మా కూతురు భార్గవి మూడేళ్ల నుంచి వెన్నుపూస నొప్పి తో బాధపడుతూ ఉండేది. నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. నంద్యాల లోని శాంతినగరం ఆసుపత్రికి తీసుకు పోయాం. ఆపరేషన్ చేస్తే మా కూతురికి బాగా అవుతుందని అక్కడ డాక్టర్లు చెప్పారు. అయితే ఆపరేషన్కు 5 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. అంత డబ్బు పెట్టుకోలేమని చెబితే అక్కడి ఆసుపత్రి డాక్టర్లు బర్డ్ ఆస్పత్రికి వెళ్ళమని చెప్పారు. ఇక్కడ డాక్టర్లను కలిసి సమస్య చెప్పడంతో డాక్టర్లు మా కూతురుని అడ్మిట్ చేసుకుని వెన్నముక ఆపరేషన్ చేశారు. ఇప్పుడు మా కూతురుకి ఏం ఇబ్బంది లేదు. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆసుపత్రిలో డాక్టర్లు మా కూతురికి ఆపరేషన్ చేశారు.

బి. శ్రీనివాస్ ముత్తుకూరు గ్రామం కలకడ మండలం చిత్తూరు జిల్లా

* చిన్నప్పటినుంచి వెన్నుపూస వంగిపోయి ఇబ్బందిగా ఉండేది. నాలుగు సంవత్సరాల నుంచి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఒక్కోసారి కింద పడి పోయేవాడిని. విశాఖపట్నంలో ఆసుపత్రులకు తిరిగాను. తిరుపతిలో బర్డ్ ఆసుపత్రికి పోతే ఉచితంగా ఆపరేషన్ చేస్తారని విశాఖపట్నంలో డాక్టర్లు చెప్పారు. దీంతో నేను బర్డ్ హాస్పిటల్ కి వచ్చి డాక్టర్ కు చూపించుకున్నాను. నడుములో నరం బెండ్ అయి ఈ పరిస్థితి ఏర్పడినట్లు డాక్టర్లు చెప్పారు. బయట ఐదు లక్షల రూపాయల ఖర్చు అయ్యే ఆపరేషన్ ఉచితంగా చేశారు. ఇప్పుడు నేను బాగా ఉన్నాను.

కె. చిన్నారావు చల్లంగి గ్రామం టెక్కలి మండలం శ్రీకాకుళం జిల్లా

* మాది కర్నూలు జిల్లా. మా కొడుకు గుణశేఖర్ చిన్నప్పటినుంచే గూనితో బాధపడుతూ ఉండేవాడు. కర్నూల్ లోని చాలా ఆసుపత్రుల్లో మా కొడుకును చూపించాను. ఐదారు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఆపరేషన్ చేస్తే బాగా అయితాదని చెప్పినారు. దోబి పనిచేసుకునే మేము అంత ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. తిరుపతి బర్డ్ ఆసుపత్రికి పోతే ఆపరేషన్ ఉచితంగా చేస్తారని కర్నూల్ లో డాక్టర్లు చెప్పారు. మా ఊరు నుంచి మా కొడుకు గుణశేఖర్ ను తీసుకొని కొచ్చిడాక్టర్ ను కలిశాను. పరీక్షలన్నీ చేసిఆగస్టు 28వ తేదీ ఆపరేషన్ చేశారు.

మా కొడుకు ఇప్పుడు మామూలు మనిషి అయ్యాడు. నడవ గలుగుతున్నాడు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా స్వామి దయతో మా కొడుక్కి ఆపరేషన్ చేశారు.

బ్రహ్మం నందివర్గం గ్రామం పాణ్యం మండలం కర్నూలు జిల్లా

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది