CULTURAL EVENTS ENTHRALL _ తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ

Tirupati, 1 Oct 19:The  dance and bhakti sangeet events organised by the TTD as a part of ongoing Brahmotsavams for the benefit of devotees and residents of Tirupati city, drew enthusiastic crowds.

The cultural wings of HDPP and  Dasa Sahitya Project, Annamacharya Project and SV College of Music and Dance are providing a feast of Bhakti sangeet, bhajans, kolatas, harikath to denizens.

On Tuesday the Kuchipudi dance presentation by the Sri Suryaprakash and a team of the  Bharata Muni Arts Academy Anantpur at the Annamacharya Kala Mandiram in the evening drew large crowds.

 Sri Srinivas and the team presented a spectacular dance program at the Mahati auditorium.

The team of Dr Varanasi Jyotilakshmi of Hyderabad presented the bhakti sangeet program at the Sri Ramachandra Pushkarini.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI  

 

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుపతిలో బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభ

అక్టోబరు 01, తిరుప‌తి, 2019: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగ‌ళ‌వారం టిటిడి ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు.

ఇందులో భాగంగా, తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన ఎం.శ్రీ‌నివాస్ బృందం చక్కటి భక్తి సంగీతం వినిపించారు.

అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అనంత‌పురానికి చెందిన భ‌ర‌త‌ముని ఆర్ట్స్ ఆకాడ‌మి శ్రీ కె.సూర్య‌ప్ర‌సాద్ బృందం కూచిపూడి – భ‌ర‌త‌నాట్యం ప్ర‌ద‌ర్శించారు. ఇందులో ముద్దుగారే యశోదకు…, గంధము పుయ్యరుగా…, నారాయణతే…., పలుకే బంగారామాయే…, త‌దిత‌ర‌ అన్నమాచార్య, త్యాగరాజ, రామదాస కృతులకు రాధిక, శ్లోక, తన్వి, సుసిమిత పటేల్, మాణిక్య, భావన, కాత్యాయని, తనూజ, విద్యాభారతి చ‌క్క‌గా నృత్యం చేశారు. వీరికి సహకరించిన మాధురి, వేణుమాధవ్ సభను రక్తి కట్టించారు.

రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు హైద‌రాబాద్‌కు చెందిన డా. వార‌ణాసి జ్యోత్స్న‌ల‌క్ష్మి భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.