BEANS AND PEANUTS GARLANDS STEAL THE SHOW DURING SNAPANAM_ చిక్కుడు, వేరుశెన‌గ మాల‌ల‌తో వేడుక‌గా శ్రీ‌నివాసునికి స్న‌ప‌నం

Tirumala, 1 Oct. 19: The garlands artistically well knitted out of the seeds of Broad Beans (Chikkudukaya) and Peanuts (Verusenaga)remained as a cynosure on the first day of Snapana Tirumanjanam as a part of ongoing annual brahmotsavams on Tuesday afternoon. 

The special abhishekam fete was performed to the processional deities of Sri Malayappa Swamy,  Sridevi and Bhudevi seated on a special platform at Ranganayakula Mandapam amidst chanting of Vedic hymns by pundits. Kankanabhattar Sri Sitaramacharyulu carried out the entire event. 

Deities were decked with nine varieties of garlands during the event which lasted for nearly two hours. Each time the ingredient of abhishekam changed, garlands were also changed in a colourful manner. 

According to Garden wing Deputy Director Sri Srinivasulu, for the first time garlands, were made of Peanuts, bean seeds, Pagadapu flowers, Dry cherries. The others include Cardomom, Dry Grapes,  Rose petals,  Kuskus and Tulasi.

While the entire mandapam is decked with Orchids brought from Indonesia and Thailand. Oriental Liliums, Gladiola,  Crysanthimum have also been used to deck the mandapam.  Apart from 400kilos of traditional flowers also brought for decoration. 

The devotees across the globe have cherished the live telecast of Snapanam on Sri Venkateswara Bhakti Channel. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

చిక్కుడు, వేరుశెన‌గ మాల‌ల‌తో వేడుక‌గా శ్రీ‌నివాసునికి స్న‌ప‌నం

అక్టోబరు 01, తిరుమల, 2019:  బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మంగ‌ళ‌వారం శ్రీ‌వారి ఆల‌యంలో చిక్కుడు, వేరుశెన‌గ గింజ‌ల‌తో ప్ర‌త్యేకంగా రూపొందించిన మాల‌ల‌తో స్న‌ప‌న‌తిరుమంజ‌నం వేడుక‌గా జ‌రిగింది. రంగ‌నాయ‌కుల మండ‌పంలో ప్ర‌త్యేక వేదిక‌పై ఆశీనులైన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి వేద మంత్రాల న‌డుమ కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ సీతారామాచార్యులు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

 దాదాపు రెండు గంట‌ల పాటు జ‌రిగిన స్న‌ప‌న‌తిరుమంజ‌నంలో 9 ర‌కాల మాల‌ల‌తో స్వామి, అమ్మ‌వార్లు భ‌క్తుల‌కు క‌నువిందు చేశారు. ప‌లు ర‌కాల సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేస్తుండ‌గా, ప్ర‌త్యేక మాల‌ల‌ను అలంక‌రించారు. మొద‌టిసారి చిక్కుడు, వేరుశెన‌గ గింజ‌ల‌తో మాల‌లు రూపొందించామ‌ని, వీటితోపాటు ప‌గ‌డ‌పు పూలు, డ్రై చెర్రీస్‌, యాల‌కులు, ఎండు ద్రాక్ష‌, రోజాలు, తుల‌సి త‌దిత‌ర మాల‌లు అలంక‌రించామ‌ని ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు తెలిపారు. ఇండోనేసియా, థాయిలాండ్ దేశాల నుండి తెప్పించిన ఆర్కిడ్ పుష్పాల‌తో రంగ‌నాయ‌కుల మండ‌పాన్ని అలంక‌రించారు. విదేశీ జాతుల పుష్పాల‌తోపాటు 400 కిలోల సంప్ర‌దాయ పుష్పాల‌ను అలంక‌ర‌ణ‌కు వినియోగించారు. క‌మ‌నీయంగా సాగిన ఈ స్న‌ప‌న తిరుమంజ‌నాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.