CULTURAL FEAST ALL THE WAY DURING BRAHMOTAVAMS _ శ్రీవారి బ్రహ్మోత్సవాల‌కు సాంస్కృతిక‌ శోభ

TIRUMALA, 30 SEPTEMBER 2022: The devotional cultural fiesta organized by TTD in connection with the ongoing annual Srivari Brahmotsavams in Tirumala, several devotional cultural music and dance programs have been alluring the devotees from dawn to desk.

On Friday, Mangaladhwani by Sri Saratbabu and team, Smt Sundari Vishnu Sahasranamam, Smt Anusha Bhakti Sangeet immersed devotees in devotional waves at Nadaneerajanam and Asthana Mandapam. Similarly, the Annmaiah Vinnapalu by Smt Suseela and team and Harikatha by Sri Venkateswarulu allured the devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల‌కు సాంస్కృతిక‌ శోభ

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 30 ; శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య‌ కళాశాలకు చెందిన శ్రీ శ‌ర‌త్‌బాబు బృందం మంగళధ్వని కార్య‌క్ర‌మం జరిగింది. తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ‌మ‌తి పిఎస్‌.సుంద‌రి బృందం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు బెంగ‌ళూరుకు చెందిన శ్రీమతి అనూష బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో శ్రీ‌మ‌తి సుశీల బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు సంగీత కార్య‌క్ర‌మం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ వై.వెంక‌టేశ్వ‌ర్లు బృందం హరికథ పారాయణం చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.