SRIVILLIPUTTUR GARLANDS _ తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

TIRUMALA, 30 SEPTEMBER 2022: Srivilliputtur Godadevi garlands have reached Tirumala on Friday ehich will be decorated as a part of Garuda Seva.

These sacred garlands were brought to Pedda Jeeyar Mutt near Bedi Anjaneya Swamy temple.

TTD Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy, Endowments Joint Commissioner of Tamil Nadu Sri Selladorai, Srivilliputtur temple Chairman Sri Ravichandran took the garlands to Srivari temple amidst Mangala Vaidyams.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 30: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు శుక్రవారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అక్కడినుంచి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, త‌మిళ‌నాడు దేవాదాయ శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ శ్రీ సెల్ల‌దొరై, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య ఛైర్మ‌న్ శ్రీ ర‌విచంద్ర‌న్ మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.

భూదేవి అవతారం గోదాదేవి

శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య ఈవో శ్రీ ముత్తురాజ‌, ఆల‌య స్థానాచార్యులు శ్రీ ర‌మేష్ స్వామి, శ్రీ సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.